ఏపీ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగావకాశాలు !

ఏపీలోని నిరుద్యోగులకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది.తాజాగా.

ఏపీ పోస్టల్ సర్కిల్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పదోతరగతి లేదా ఐటీఐ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది.

సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 28లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఎంపికైన వారికి నెలకు రూ.18,000 జీతంగా ఇస్తారు.ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.

పోస్టుల వివరాలు.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 46 పోస్టులు

అర్హత:

పదోతరగతి లేదా ఐటీఐ.

వయసు:

28.02.2019 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు:

అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.100, పరీక్ష ఫీజు రూ.400 కలిపి మొత్తం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ (ఎస్సీ, ఎస్టీ)‌లకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

Advertisement

పోస్టాఫీసులో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

పేస్కేలు:

రూ.18,000.ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.

ఎంపిక విధానం:

రాతపరీక్ష ద్వారా.

రాతపరీక్ష విధానం:

మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.100 ప్రశ్నలు ఉంటాయి.ఒక్కోప్రశ్నకు ఒకమార్కు.

వీటిలో పార్ట్-ఎ జనరల్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు, పార్ట్-బి మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు; పార్ట్-సి ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు, తెలుగు నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు.ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.

పరీక్ష సమయం 120 నిమిషాలు.

పరీక్ష కేంద్రాలు:

కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.

ముఖ్యమైన తేదీలు.

✦ మొదటిదశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 31.01.2019.✦ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 28.02.2019.✦ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.03.2019.✦ చివరిదశ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 08.03.2019.

చిప్స్ ఇష్టంగా తింటున్నారా..అయితే ఇది చదివితీరాల్సిందే....
Advertisement

తాజా వార్తలు