https://telugustop.com/wp-content/uploads/2021/06/samayam-telugu-25.jpg

మరోసారి తన మాటలకు పదును పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇంట్లో ఉంటున్న లోకేష్ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావా అంటూ ఓ రేంజ్ లో అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన అనిల్ ఈ సందర్భంగా చంద్రబాబు లోకేష్ తీరు పై విమర్శలు చేశారు.తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి అని చెప్పుకున్న నీకు డిపాజిట్ కూడా దక్కలేదు అంటూ లోకేష్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

Jagan, Ap Cm, Ysrcp, Tdp, Minister Anil Kumar Yadav, Heritej, Amul, Milk Dairy,

అమరావతి ప్రజలు నిన్ను ఛీ కొట్టి పంపించారని అనిల్ విమర్శించారు జగన్ ను నువ్వు తిడితే టీవీలో చూపిస్తారనే శునకానందం తప్ప ఏమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు ముదురు కాబట్టి ఈ రాష్ట్రంలో టైం అయిపోయింది అని ముందుగానే గ్రహించి హైదరాబాద్ కు మకాం మార్చాడు అని,  అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నాడని అనిల్ కామెంట్ చేశారు.పాడి రైతులు మేలుకోసం జగన్ ఆలోచిస్తుంటే, నువ్వు హెరిటేజ్ సంస్థను అడ్డుపెట్టుకుని అనేక మందిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు అంటూ లోకేష్ పై అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagan, Ap Cm, Ysrcp, Tdp, Minister Anil Kumar Yadav, Heritej, Amul, Milk Dairy,

నీకు పప్పు అని ప్రజలు బిరుదు ఇచ్చారని , అది మేము ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యానించారు.జగన్ అమూల్ బేబీ అయితే నువ్వు హెరిటేజ్ దున్నపోతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.గడ్డం పెంచి జూమ్ లోకి వస్తే మాస్ లీడర్ అవుతారా ? అది బ్లడ్ లో ఉండాలన్నారు.రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం ఏ మంచి పనులు చేశారో అదే ఇప్పుడు జగన్ చేస్తున్నారు అని అనిల్ చెప్పుకొచ్చారు.

Advertisement
Jagan, Ap Cm, Ysrcp, TDP, Minister Anil Kumar Yadav, Heritej, Amul, Milk Dairy,

అనిల్ మీడియా సమావేశం మొత్తం లోకేష్ చంద్రబాబు తీరుపై విరుచుకుపడుతునే సాగింది.ఏపీలో అమూల్ సంస్థ కార్యకలాపాలు మొదలైన దగ్గర నుంచి అదే పనిగా లోకేష్ చంద్రబాబు తదితర నాయకులు విమర్శలు చేస్తున్న క్రమంలో ఈ విధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు