మా “బాబే”..తండ్రిని పొగడ్తలతో ముంచెత్తిన కొడుకు

అంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి .టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక్కసారిగా ఏపీ సీఎం అయిన తన తండ్రి చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు.

ఎన్నడు లేని విధంగా చంద్రబాబు లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూసి అందరు షాక్ అయ్యారు కూడా.అసలు లోకేష్ మీడియా తో ఏమి మాట్లాడారు అంటే.

చంద్రబాబు గారి లాంటి వ్యక్తి ఏపీ కి సీఎం అవడం ఎంతో అదృష్టం అని అన్నారు.చంద్రబాబు గారు పెట్టిన పధకాలు ఎంతో మంది పేదలకి చేరువ అవుతున్నాయి అన్నారు.

అప్పట్లో నాన్న గారు అంటూ లోకేష్ మాట్లాడిన తీరు మధ్య మధ్యలో తన మామ బాలకృష్ణ ని తలపించింది కూడా.అయితే చంద్రబాబు నాయుడు పడే కష్టం గురించి నాకు బాగా తెలుసు అని చెప్పిన లోకేష్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Advertisement

రాష్ట్రాన్ని విభజించిన విధానం సరిగాలేదని అన్నారు.కొత్త రాష్ట్రాన్ని అప్పులతో మొదలు పెట్టాము అని అయినా సరే చంద్రబాబు గారి ముందు చూపు , అనుభవంతో ఎంతో ముందుకు తీసుకువెళ్తున్నారు అని అన్నారు.

ఏపీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు గారు రాజీ పడరని అన్నారు.అయితే ముఖ్యమంత్రికి కార్యాలయానికి వసతి లేని సమయంలో బస్సులో ఉండే ఆరునెలల పరిపాలన సాగించిందిన వ్యక్తి చంద్రబాబు ఒక్కరే అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

అంతేకాదు నదుల అనుసంధానం గురించి అందరు మాటలకే పరిమితం అయ్యారు కానీ చంద్రబాబు గారు చేసి చూపించారు అని తెలిపారు.మరుగుదొడ్లు దేశవ్యాప్తంగా 36శాతం మందికి మాత్రమే ఉంటే ఆంధ్రప్రదేశ్‌‌లో 80శాతం మరుగుదొడ్లు పూరి చేసింది మనమే అన్నారు.

డిసెంబర్ – 2018 వచ్చే సరికి ఏపీలో ఉండే ప్రతీ ఒక్కరికీ సురక్షితమైన త్రాగు నీరు అందిస్తామని తెలిపారు.చంద్రబాబు గారి లక్ష్యం ఒక్కటే 2029 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ ఉండాలనేది చంద్రబాబు గారి కోరిక అంటూ చెప్పుకొచ్చారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
గేమ్ ఛేంజర్ మూవీకి నెగిటివ్ ప్రచారం చేసింది వాళ్లేనా.. అసలేం జరిగిందంటే?

తమ పనుల కోసం ప్రజలు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చంద్రబాబు గారు జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రవేశపెట్టారు అని అన్నారు.అయితే సీఎం గా ఉండే ఎటువంటి వ్యక్తీ అయినా సరే చేయవలసిన పనులు ప్రజలకి సేవ చేయడమే దానికి ఇంతాలా డబ్బాలు కొట్టుకోవాలా అంటూ లోకేష్ పై సెటైర్స్ వేస్తున్నారు వైసీపి వాళ్ళు.

Advertisement

తాజా వార్తలు