అప్పుల కుప్పగా ఏపీ.. దేశంలోనే మూడో స్థానం

ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది.ఇది విపక్షాల ఆరోపణ.

అప్పుల్లో రాష్ట్రం గీత దాటలేదు ఇది అధికార పక్షం వివరణ.ఇదే సమయంలో కేంద్రం అప్పుల్లో టాప్ టెన్ రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది.

అందులో ఏపీ నాలుగో స్థానం రావడంతో మళ్లీ విపక్షాలకు బలం చేకూరింది.వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీని మరో శ్రీలంకలా మారుస్తుందని ఆరోపించాయి.

మరోవైపు, చంద్రబాబు నాయుడు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని విజయసాయి రెడ్డి.తాజాగా ఆరోపించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందన్నారు.

Advertisement

ఇంతకీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి విపక్షాలు అన్నట్లుగా సీరియస్ గా ఉందా ? లేక ప్రభుత్వం చెబుతున్నట్లుగా సురక్షితంగానే ఉందా ? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పుల్లో రికార్డులు సృష్టిస్తోంది.2022 మార్చి 31 నాటికి ఏపీ ప్రభుత్వం 3 లక్షల 98 వేల 903 కోట్ల రూపాయల అప్పు చేసినట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది.దీంతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న హెచ్చరిక నిజమే అని అర్థమవుతుంది.

శ్రీలంక పరిస్థితిని చూసైనా సరే జాగ్రత్తపడాలని ఏపీతోపాటు మరో పది రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.కానీ ఆ సమావేశంలో కేంద్రం చెప్పినదానికన్నా ఎక్కువ అప్పులే ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ సర్కారు చేసిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

దీంతో రాష్ట్రంలో గగ్గోలు మొదలైంది.రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతుందని విపక్షాలు ఆరోపించాయి.పరిస్థితి ఇలాగే కొనసాగితే.

ఏపీ మరో శ్రీలంకగా మారుతుందని హెచ్చరించాయి.మరోవైపు, అభివృద్ధి కోసమే ఏపీ ప్రభుత్వం అప్పులు చేసిందని.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అదీ పరిమితికి లోబడే అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వివరించారు.కావాలనే చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

రాష్ట్ర జీడీపీలో అప్పులు 4 శాతానికి మించకూడదన్నది.ఆర్థిక సంఘం చెప్పిన లెక్కే.అంటే ఇలా బడ్జెట్ లో చూపకుండానే సుమారు లక్ష కోట్లకు పైగా రుణాలు తీసుకుందంటున్నారు ఆర్థిక నిపుణులు.

వీటికి ఏటా అసలు, వడ్డీల రూపంలో చెల్లిస్తోంది 15 వేల కోట్లు ఉంటుందని అంచనా.రుణాలు రూ.4,13,000 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ.1,38,603 కోట్లు, స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పు రూ.10,000 కోట్లు, నాన్ గ్యారంటీ రుణాలు రూ.77,233 కోట్లుగా అంచనా వేస్తున్నారు నిపుణులు.అంటే ఇవన్నీ కలిపితే.ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు రూ.7,88,836 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది.

తాజా వార్తలు