ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు( AP Inter Results ) విడుదల అయ్యాయి.

పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే ఫలితాలను ఇంటర్ విద్యామండలి( Inter Board ) వెల్లడించింది.

ఈ మేరకు తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్( Inter Board Secretary Saurabh Gaur ) ప్రకటించారు.ఇంటర్ మొదటి సంవత్సరంలో విద్యార్థులు 67 శాతం ఉత్తీర్ణత సాధించగా.

ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 78 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 84 శాతంతో కృష్ణా జిల్లా( Krishna District ) మొదటి స్థానంలో ఉంది.

రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు నిలిచారని ఆయన తెలిపారున.ఈ క్రమంలోనే అనుకున్న ఫలితాలు పొందలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని ఆయన సూచించారు.

Advertisement

అదేవిధంగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 18 నుంచి 24 వ తేదీ వరకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.అయితే మార్చి ఒకటి నుంచి 20 తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించగా.ఈ పరీక్షలకు మొత్తం 9.99 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారన్న సంగతి తెలిసిందే.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు