ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు

అహోబిలం మఠం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.ఈ మేరకు రాష్ట్ర సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది.

మఠం వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని పేర్కొంది.అనంతరం మఠాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది.

ఆలయాలను, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని.ప్రభుత్వ జోక్యం అవసరం లేదని పేర్కొంది.

కాగా అహోబిలం మఠంలో ఈఓ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టగా ఆ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు