ఇకపై సర్కారు బడిలో విద్యార్థులు కూడా బయో మెట్రిక్ .!

జగన్ సర్కార్ ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు చదువుపై మక్కువ పెంచేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది.

పేద పిల్లలకు సైతం మెరుగైన విద్యా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.

నేటి బాలలే రేపటి భావితరాల పౌరులు అని.వారిని మంచి మార్గంలో నడిపించాలని జగన్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.ఇందులో భాగంగా విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు ప్రతిరోజు హాజరయ్యేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉండేలా కొత్త నియమాలను రూపొందించింది ప్రభుత్వం.ఈ మేరకు విద్యార్థుల హాజరును బయోమెట్రిక్‌ ద్వారా నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది.

మనబడి-నాడు-నేడు కార్యక్రమం కింద జగన్ సర్కార్ ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతోంది.అంతే కాదు ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలన్న ఆకాంక్షతో వారి తల్లులకు జగనన్న అమ్మఒడి కింద ప్రతి ఏడాది రూ.15 వేలు అందిస్తోంది.దానికితోడు విద్యా కానుక కింద విద్యార్థులకు అవసరమయ్యే అన్ని వస్తువులను అందిస్తోంది.

Advertisement
AP Government Biometric Option In Schools,AP Schools, Andhra Pradesh Govt, YS Ja

అయితే అమ్మఒడి ద్వారా లబ్ధి పొందాలంటే ఇకపై విద్యార్థులకు 75 శాతం కనీస హాజరు తప్పనిసరి.విద్యార్థుల హాజరును కచ్చితత్వంతో లెక్కించడానికి జగన్ సర్కార్ ప్రత్యేక యాప్‌ను తీసుకురావడం హర్షణీయం.

Ap Government Biometric Option In Schools,ap Schools, Andhra Pradesh Govt, Ys Ja

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల తల్లులకు అమ్మఒడి పథకం కింద నగదు సాయం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే విద్యార్థులు చక్కగా బడికి పోవడానికే ఆర్థిక సహాయం చేస్తున్నారు కాబట్టి అది నిర్ధారించడం కూడా ముఖ్యమే.అందుకే తాజాగా బయోమెట్రిక్‌ హాజరు యాప్‌ను తీసుకొచ్చింది.

ఇప్పటికే ఈ అప్లికేషన్ పనితీరును టెస్ట్ చేయడానికి ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.ఈ ప్రయోగ దశలోనే బయోమెట్రిక్ హాజరు విషయంలో ఏవైనా లోపాలు గుర్తిస్తే.

వాటిని ప్రభుత్వం పరిష్కరించనుంది.ఆ తర్వాత దీనిని ఆంధ్రప్రదేశ్ అంతటా అమలులోకి తెస్తుంది.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..
Advertisement

తాజా వార్తలు