పోలింగ్ గందరగోళం... బౌతిక దాడులు! వైసీపీ టీడీపీ పార్టీల ఎదురుదాడి

ఏపీలో గత నెల రోజులుగా జరుగుతున్నా ఎన్నికల పోరుకి ముగింపు వచ్చింది.

ఫలితం ఇంకా తెలియకపోయినా, ఈ సారి ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగిన పోలింగ్ శాతం రాష్ట్ర రాజకీయాలలో అధికారంలోకి ఎవరు రావాలి అనే అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేసారు.

అయితే ప్రజల ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనే విషయం తెలియాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే.ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికలలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం తలెత్తింది.

అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు భౌతిక దాడులు చేసుకోవడం, అలాగే చాలా చోట్ల దాడులు చేయడం, పోలీసులపైన రాళ్ళు రువ్వడం వంటి వాటికి పాల్పడ్డారు.ఓ విధంగా చెప్పాలంటే రెండు పార్టీలు ఓటింగ్ కి వచ్చే ప్రజలని భయబ్రాంతులకి గురి చేసే ప్రయత్నం చేసారు.

అయిన కూడా ప్రజలు ఈ సారి ఊహించని స్థాయిలో పోలింగ్ కేంద్రాలకి వచ్చి తమ ఓటు వేయడం విశేషం.ఎన్నడూ లేని విధంగా ఏపీలో పెరిగిన ఓటింగ్ శాతం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.

Advertisement

ఇక పోలింగ్ అనంతరం వైసీపీ అధినేత జగన్ మీడియా ముందుకి వచ్చి అధికార పార్టీ చాలా చోట్ల ప్రజలని, తమ పార్టీ నేతలని భయపెట్టే ప్రయాత్నం చేశారాని, అయిన కూడా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ముందుకొచ్చారని చెప్పుకొచ్చారు.చాలా చోట్ల అధికారులని ఓటర్స్ ని భయపెట్టి ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు.మొత్తానికి ఈ ఎన్న్నికలు వైసీపీ, టీడీపీ పార్టీల దాడులు ప్రతి దాడులు మధ్య జరిగాయని చెప్పాలి.

జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తారా ? అందుకే అలా అన్నారా ? 
Advertisement

తాజా వార్తలు