సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి మొత్తం సెట్‌ చేస్తాడా?

ఏపీ రాజకీయాలు పూర్తిగా వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య చుట్టూ తిరుగుతున్నాయి.

అధికార పార్టీ కి ఈ హత్య కేసు మెడ కు చుట్టుకునేలా ఉంది.

ఇదే అదునుగా తెలుగు దేశం పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది.ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

ఇదే కేసులో అధికార పార్టీ ఎంపీ అయిన వైయస్ అవినాష్ రెడ్డి ని( YS Avinash Reddy ) కూడా సిబిఐ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి అవినాష్ రెడ్డి అరెస్టు ను వాయిదా వేయడం జరిగింది.

ఈ లోపు సీఎం జగన్మోహన్ రెడ్డి( CM Jagan ) ఢిల్లీ వెళ్లి అంత సెట్ చేస్తాడు అని వైకాపా నాయకులు చాలా నమ్మకం తో ఉన్నారు.

Advertisement

కేంద్రం లో బిజెపి తో సన్నిహితం గా ఉండే జగన్మోహన్ రెడ్డి కి ఈ కేసు విషయం లో ప్రధాని నరేంద్ర మోడీ హోం శాఖ మంత్రి అమిత్ షా కాస్త అయినా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకోకపోతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఢిల్లీ వెళ్లబోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని కలుస్తాడు.ఏ విషయమై చర్చిస్తాడు అనే విషయం లో స్పష్టత లేదు.

కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉందని మాత్రం వార్తలు వస్తున్నాయి.

అవినాష్ రెడ్డి కి కోర్టు ఇచ్చిన గడువు లోపు ఢిల్లీ వెళ్లి జగన్ మొత్తం చక్క పెట్టాల్సి ఉంది.మరి ఢిల్లీ వెళ్లబోతున్న జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఫలితం తో తిరిగి ఏపీకి వస్తాడు అనేది కూడా చూడాలి.అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కచ్చితంగా రాజకీయ ప్రకంపనలు కి తెరలేపే అవకాశం ఉంది.

కనుక అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా అన్ని అస్త్రాలను జగన్మోహన్ రెడ్డి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అవినాష్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు అవ్వడంతో పాటు ఆయన పార్టీ లో కీలక నేత అవ్వడం వల్ల జగన్‌ మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!
Advertisement

తాజా వార్తలు