రేపు ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లబోతూ ఉండడం, ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దాదాపు ఖరారు కావడంతో ఆయన హస్తిన బాట పట్టనున్నారు.
గత కొంతకాలంగా ఏపీలో బీజేపీ వైసీపీల మధ్య విమర్శలు , ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్న క్రమంలోనే ప్రధాని తో జగన్ భేటీ కాబోతూ ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బాట పట్టారు.ప్రధానితో సమావేశం అయ్యేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో జగన్ సైతం ప్రధాని కలవబోతూ ఉండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లడం దానికి కారణాలు చాలానే ఉన్నాయి.
ఈరోజు ఏపీలో కొత్త జిల్లాల ను జగన్ ఏర్పాటు చేశారు.దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారాలతో పాటు ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర పెండింగ్ అంశాలే కాకుండా అనేక కీలక అంశాలపై చర్చించబోతూ ఉండడం, అలాగే పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన విషయాల పైన వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రధాని నరేంద్ర మోదీ తో రేపు సాయంత్రం 4.30 గంటలకు జగన్ భేటీ అవుతారు.ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు, కొంతమంది కీలకమైన బిజెపి నాయకులను జగన్ కలవబోతున్నారు.
దీంతో జగన్ పర్యటన పై రాజకీయంగా ఆసక్తి పెరిగింది.టిడిపి , జనసేన తో పాటు , ఏపీ బిజెపి నాయకులు జగన్ పర్యటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీసే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది . బిజెపి జనసేన మద్దతుతో ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తున్న సమయంలోనే ఇప్పుడు జగన్ ప్రధానితో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు, ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల పైన చర్చించే అవకాశం ఉందనే వార్తలతో వైసిపి ప్రత్యర్థి పార్టీలన్నీ ఈ పర్యటనపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy