నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది.సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీకానుంది.

ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది.ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్లపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

పీఆర్సీతో పాటు డీఏ బకాయిలు వాయిదాల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.దాంతోపాటు సీపీఎస్ రద్దు అంశంపైనా చర్చించే ఛాన్స్ ఉంది.

అటు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది.అదేవిధంగా సంక్షేమ పథకాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు