ఈనెల 24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 వరకు జరగనున్నాయి.స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏర్పాటైన బీఏసీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో తొమ్మిది రోజులపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.ఈనెల 16న రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ సమావేశంలో సీఎం జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేశ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అవ్వగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు