గాంధీనగర్ ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను గాంధీ నగర్ లో ప్రధాన నరేంద్ర మోది ప్రారంభించారు.
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది.
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
ర్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు యాదాద్రిలో పర్యటించనున్నారు.
బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలని ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొన్నారంటూ టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఎలక్ట్రిక్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఫ్రాన్స్ కు చెందిన స్నీడర్ ఎలక్ట్రిక్ కంపెనీ హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.ఈ మేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ రిమోట్ ద్వారా ఫ్యాక్టరీ శంకుస్థాపనను ప్రారంభించారు.
కర్నూలుకు చెందిన ఒక కేసులో రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు దిమ్మను తొలగించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరు జిల్లాలోని ఇన్నర్ రింగురోడ్డు కూడలి వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం పై గుడివాడలో టిడిపి శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
హైదరాబాదులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పంచమ తిధి సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే నెల 15 నుంచి 5 విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు.
చింతపల్లి ఎంపీపీ వంతల బాబురావును పదవి నుంచి తొలగించాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఎన్నికల అథారిటీ నుంచి ఉత్తర్వులు జారి అయ్యాయి.
ఎంఐఎం అధినేత లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఓవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆలోచన బిజెపికి లేదని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయడం లేదని, ఖర్గే కే తాను మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో కనకదుర్గమ్మ వారు దర్శనం ఇచ్చారు.
మొన్న గాయం కారణంగా టీమిండియా ఫేస్ గన్ బుమ్రా దక్షిణాఫ్రికా తో టి 20 సిరీస్ తో పాటు, టి20 ప్రపంచ కప్ టోర్నీకి దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
అమరావతి పరిరక్షణ లక్ష్యంగా రాజధాని ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర ఏలూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy