న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ

ఈనెల 27న ఖమ్మంలో బిజెపి భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.

ఈ సభకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

2.టిఆర్టి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది .ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టిఆర్టి నోటిఫికేషన్ ను నేడు విడుదల చేసింది.

3.జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని,  కులం,  మతం ప్రాంతం పార్టీ చూడకుండా పథకాలను అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు.

4.రేణుక చౌదరి కామెంట్స్

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మంచి నాయకుడని కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వస్తే ఆహ్వానిస్తామని మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి అన్నారు

5.వైద్య ఆరోగ్యశాఖ పై జగన్ సమీక్ష

వైద్య ఆరోగ్య శాఖ పై నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష మొదలైంది.

6.ఏపీలో లబ్ధిదారులకు నిధులు విడుదల

ఏపీలో అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.వివిధ కారణాల వల్ల పలు పథకాలు అందని వారి ఖాతాలో నేడు నగదు ను బట్టన్ నొక్కి జగన్ జమ చేశారు.

7.తిరుమల సమాచారం

Advertisement

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది.నవంబర్ నెల కు సంబంధించిన 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.

8.బంగాళాఖాతంలో అల్పపీడనం

తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై వాతావరణ శాఖ ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది.

9.జ్యోతి సురేఖకు జగన్ అభినందనలు

భారత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖను ఏపీ సీఎం జగన్ అభినందించారు.తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈరోజు జగన్ ను జ్యోతి సురేఖ కలిశారు.

10.మంత్రి బుగ్గన కు కాంగ్రెస్ నేత  సవాల్

ప్రాజెక్టులపై చర్చకి రావాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు.

11.ఏపీ డీజీపీకి పోసాని ఫిర్యాదు

నారా లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని,  నేను చస్తే దానికి కారణం లోకేష్ దానికి కారణం అంటూ ఏపీ డీజీపీ కి ఫిర్యాదు చేశారు.

12.పురందరేశ్వరి విమర్శలు

నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి విమర్శలు చేశారు.

13.ఏపీలో తెలుగు భాషా వారోత్సవాలు

నేటి నుంచి ఏపీలో తెలుగు భాష వారోత్సవాలు నిర్వహించనున్నారు.

14.నేడు ఏపీలో వర్షాలు

ఏపీలో పలుచోట్ల నీరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

15.గద్వాల ఎమ్మెల్యే పై అనర్హత వేటు

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

గద్వాల బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హై కోర్టు తీర్పు చెప్పింది.గద్వాల ఎమ్మెల్యే గా డీకే అరుణ ను ప్రకటించింది.

16.తలసాని పై లంబాడీ సంఘాల ఆందోళన

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు పై తలసాని శ్రీనివాస యాదవ్ ఈ నెల 19 న చేయి చేసుకున్నారు.ఈ నేపథ్యంలో లంబాడి సంఘాలు ఈ రోజు ఆందోళనకు దిగాయి.

17.వనస్థలిపురంలో చిరుత కదలికలు

Advertisement

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో చిరుత పులి కదలికలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు .

18.మంత్రి అజయ్ కు మతి లేదు

మంత్రి పగోడా అజయ్ కుమార్ కు మతిలేదని పర్సంటేజ్ పెట్టుకుని పనిచేస్తున్నారని, పనిచేసిన వారిని మరచి మతి లేని వారికి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని కమ్మ ఐక్య వేదిక నేత రామారావు విమర్శించారు.

19.మంత్రిగా ప్రమాణ స్వీకారం

తెలంగాణ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు.

20.మంత్రి గంగుల కమలాకర్ ఇంటిముందు ఉద్రిక్తత

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిముందు ఉద్రిక్తత నెలకొంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, మంత్రి ఇంటిని బిజెపి నేతలు ముట్టడించారు.

తాజా వార్తలు