న్యూస్ రౌండప్ టాప్ 20

1.వెంకటరెడ్డి ని సస్పెండ్ చేయాలి : చెరుకు సుధాకర్ ఫిర్యాదు

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఫిర్యాదు చేశారు.

2.జగన్ పై లోకేష్ కామెంట్స్

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

జగన్ పాలనలో అందరూ బాధితులే అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు.

3.కవితపై ఈడి కేసు : ఏపీ బీఆర్ఎస్ స్పందన

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కి లాగడం, అవినీతి కేసుల్లో ఇరికించడం కక్షపూరిత చర్య అని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు.

4.తేజస్విని యాదవ్ కు సిబిఐ సమన్లు

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు(Tejaswi Yadav) సిబిఐ ఈరోజు సమన్లు జారీ చేసింది.భూములు తీసుకుని రైల్వే ఉద్యోగాలు ఇచ్చిన కుంభకోణంలో ఈ సమన్లు జారీ అయ్యాయి.

5.ఈడీ విచారణకు హాజరైన కవిత

ఎమ్మెల్సీ కవిత ఈ డి అధికారుల విచారణకు హాజరయ్యారు.ఆమెతోపాటు ఒక న్యాయవాది ఆమె వెంట వెళ్లారు.

6.తిరుమల సమాచారం

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శనివారం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

7.కవిత విచారణ పై కెసిఆర్ కామెంట్స్

 ఈడి అధికారులు కవితను(MLC Kavitha) విచారణకు పిలవడంపై సీఎం కేసీఆర్ స్పందించారు.మహా అయితే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు అంతే కదా అంటూ కేసిఆర్ స్పందించారు.

8.కవితకు అసదుద్దీన్ మద్దతు

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.కెసిఆర్ కుటుంబాన్ని వేదించడంలో మోది బిజీగా ఉన్నారని ఆయన అన్నారు.

9.కవిత వ్యవహారం పై రేవంత్ రెడ్డి కామెంట్స్

ఈడి అధికారులు తలుచుకుంటే కవితను జైలుకు పంపవచ్చు అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

10.బలగం చిత్రం యూనిట్ కి చిరంజీవి సన్మానం

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమా చిత్ర యూనిట్ కి మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) సన్మానం చేసి అభినందించారు.

11.తమ్మారెడ్డి భరద్వాజ వార్నింగ్

ఆర్ఆర్ సినిమాపై దర్శకనిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో,  ఆయన వ్యాఖ్యలు తప్పుపడుతూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ పై తమ్మా రెడ్డి భరద్వాజ స్పందించారు.నేను నోరు విప్పితే అందరి బాగోతాలు బయటపడతాయి అంటూ తమ్మారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

12.ఢిల్లీ లో కేసీఆర్ నివాసం వద్ద భారీగా పోలీసులు

దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడి అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు

13.అజారుద్దీన్ కామెంట్స్

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవకాశం ఇస్తే కామరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు.

14.రేవంత్ రెడ్డి పాదయాత్ర

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చేపట్టిన హాథ్ సే హాథ్  జోడో పాదయాత్ర నేడు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతోంది.

15.కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈరోజు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరైన నేపథ్యంలో,  కవితకు మద్దతుగా బిజెపిని విమర్శిస్తూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఢిల్లీ లో వెలిశాయి.

16.ఢిల్లీ లో కేటీఆర్

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడి అధికారులు నోటీసులు జారీ చేసి ఈరోజు విచారిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ అక్కడే మఖాం వేశారు.రేపు ఆయన ఢిల్లీలోని ఉండబోతున్నారు.

17.నేడు హైదరాబాద్ కు అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ కు రానున్నారు.

18.నాదెండ్ల మనోహర్ కామెంట్స్

Advertisement

జనసేన బీసీ కులాల ఐక్యత కోరుకుంటున్నాను,  వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

తాజా వార్తలు