న్యూస్ రౌండప్ టాప్ 20

1.రెండో రోజు రాహుల్ పాదయాత్ర

రెండో రోజు కాంగ్రెస్ జూడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు.

 

2.కౌలు రైతు సదస్సు

  విజయవాడ ఎంబివిజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి కవులు రైతు సదస్సు జరుగుతోంది . 

3.వెంకయ్య నాయుడు పర్యటన

 

తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జిఎస్ఎల్ హాస్పిటల్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. 

4.అన్నా క్యాంటీన్ ప్రారంభం

  తిరుపతిలో నేడు ఎం ఆర్ పల్లెలో టిడిపి అన్నా క్యాంటీన్ ప్రారంభించింది. 

5.నాలుగు రోజులపాటు వర్షాలు

 

ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు దక్షిణాదిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

6.భక్తుల కోసం జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు

  నిమజ్జనం సందర్భంగా ఊరేగింపుకు హాజరయ్యే భక్తుల కోసం జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. 

7.నీట్ పరీక్ష ఫలితాల్లో ఐదో ర్యాంకు

 

Advertisement

నీట్ పరీక్ష ఫలితాలు తెలంగాణ విద్యార్థి ఎర్రబెల్లి సిద్ధారావు జాతీయస్థాయిలో ఐదో ర్యాంకును సాధించారు. 

8.భారీ వరద

 నాగార్జునసాగర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.దీంతో 20 క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. 

9.సిపిఐ నారాయణ కామెంట్స్

 

కెసిఆర్ వల్లే తెలంగాణలో బిజెపి బలం పెంచుకుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 

10.పదో తేదీ వరకు అగ్రిటెక్చర్ కోర్సులకు ప్రవేశ గడువు

  ఈనెల 10వ తేదీ వరకు అగ్రిటెక్చర్ పోస్టుల్లో ప్రవేశాలకు గడువు ను  పొడిగించారు. 

11.మహా పాదయాత్రకు అనుమతి పై హైకోర్టులో విచారణ

 

అమరావతి మహా పాదయాత్రకు అనుమతి పై ఏపీ హైకోర్టు లో విచారణ జరిగింది.దీనిపై తమ నిర్ణయాన్ని రేపు హై కోర్ట్ కు తెలుపుతాము అని ప్రభుత్వ న్యాయవాది కోర్టు కు తెలిపారు. 

12.లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

  మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

13.టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్

 

ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.టౌన్ ప్లానింగ్ విభాగంలో మొత్తం 175 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 

14.నిమ్స్ కు కొత్త డైరెక్టర్

  నిజం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు కొత్త డైరెక్టర్ ను నియమించే పనులు తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. 

15.తెలంగాణ గవర్నర్ కామెంట్స్

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

తనకు గౌరవం ఇవ్వకపోతే ఎవరిని లెక్క చేయనని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ అన్నారు. 

16.విపత్తుల సంస్థ హెచ్చరిక

  తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని,దీని ప్రభావంతో రాగల  48 గంటల్లో  ప్రాంతాల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 

17.ఉమెన్ చాందిని కలిసిన శైలజానాథ్

 

Advertisement

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ కలిసారు. 

18.నారా లోకేష్ కామెంట్స్

  నాపై 15 కేసులు పెట్టారు ఏడుసార్లు పిఎస్ కు తీసుకువెళ్లారు.పోలీస్ స్టేషన్ తనకు అత్తారిల్లు అయింది అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కామెంట్ చేశారు. 

19.కృష్ణ నదికి వరద ఉధృతి.అధికారులు అప్రమత్తం

 

కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,650   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 50,890.

తాజా వార్తలు