న్యూస్ రౌండప్ టాప్ 20

1.దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ కు చేరుకుని సిద్దిపేట జిల్లాకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2.వైఎస్ వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

3.భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ గా అగార్కర్

టీం ఇండియా మాజీ ఫేసర్ అజిత్ అధార్కర్( Ajit Agarkar ) కు భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ గా అవకాశం దక్కింది.

4.జగన్ ఢిల్లీ టూర్ విశేషాలు

ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఆయన భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఏపీకి  నిధులు, పెండింగ్ బకాయిలపై ఆయన చర్చించారు.

5.పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి

Advertisement

బిజెపి పార్టీ విధానానికి తాను కట్టుబడి ఉంటానని ప్రధాని మోదీ సభ తర్వాత అధికారికంగా బాధ్యతలు తీసుకుంటానని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

6.గిరిజనులపై మూత్ర విసర్జన.

రాహుల్ గాంధీ ఆగ్రహం

గిరిజనులు దళితులపై బిజెపి నిరంకుశత్వానికి నిదర్శనం ఇదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.గిరిజనులపై మూత్ర విసర్జన చేసిన ఘటనపై రాహుల్ ఈ విధంగా స్పందించారు.

7.కేటీఆర్ కామెంట్స్

పాతబస్తీ మెట్రో ను ఎల్ అండ్ టి పూర్తి చేయకపోతే మేమే నిర్మిస్తామని తెలంగాణ మంత్రి

8.మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది :సుమన్

ఏపీలో మరోసారి వైసిపి అధికారంలోకి వస్తుందని సినీ నటుడు సుమన్( Suman ) అన్నారు.

9.ప్రధానిపై లాలు ఆగ్రహం

కేసులతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆర్జెడి అధినేత లాలూ  ప్రసాద్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

10.అమెరికాకు వెళ్తున్న మెగాస్టార్

బోలా శంకర్ సినిమా  షూటింగ్ పూర్తి కావడంతో మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా న్యూయార్క్ వెళ్లనున్నట్లు సమాచారం.1

1.కేంద్రమే పోలవరం పూర్తి చేయాలి : సిపిఐ

కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

12.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

తనకు భయమనేదే లేదని,  చర్చలకు కాదు యుద్ధానికి అయినా వస్తానని మాజీ మంత్రి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చాలెంజ్ చేశారు.

13.రాహుల్ గాంధీ పై హరీష్ రావు ఆగ్రహం

అది నోరా.మోరా.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

మీకు మొక్కాలి అంటూ రాహుల్ గాంధీ( Rahul gandhi ) పై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారని, అసలు కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఇంత పంట ఎలా పండింది అని హరీష్ రావు ప్రశ్నించారు.

14.చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు

క్యాసినో వ్యవహారంలో అనేక ఆరోపణ లు ఎదుర్కొంటున్న సీకోటి ప్రవీణ్ పై గజ్వేల్ పోలీస్ కేసు నమోదు చేశారు .ఎటువంటి అనుమతులు లేకుండా నిన్న గజ్వేల్ పట్టణానికి వచ్చి ర్యాలీగా వెళ్లిన ప్రవీణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

15.కేంద్ర క్యాబినెట్ భేటీ

ప్రధాన నరేంద్ర మోడీ( Narendra Modi ) అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ జరిగింది.

16.బండి సంజయ్ ట్వీట్

Advertisement

బిజెపి తెలంగాణ అధ్యక్షుడుగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అభినందిస్తూ ట్విట్ చేశారు.

17.తెలంగాణకు రెయిన్ అలర్ట్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.ఈ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాబోయే మూడు రోజుల్లోనూ భారీ వర్షాలు నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

18.కడప జిల్లాలో జగన్ పర్యటన

ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు జిల్లాలో ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు.

19.బంద్ కు ఏబీవీపీ పిలుపు

ఏపీలో విద్యాసంస్థల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ చేపట్టారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -54,150

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -59,060

తాజా వార్తలు