న్యూస్ రౌండప్ టాప్ 20

1.

ఆదాని సంక్షోభం పై చర్చకు ప్రతిపక్షాల నిర్ణయం

ఆదాని గ్రూప్ వ్యవహారంపై హిండెన్ బర్గ్ నివేదికపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఈరోజు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.

ఆదాని స్టాక్ క్రాస్ పై సిపిఐ కి చెందిన బినో విశ్వన్ రాజ్యసభలో ఇచ్చిన బిజినెస్ నోటీసులు సస్పెండ్ చేశారు.ఆదాని స్టాక్ క్రాస్ పై అత్యవసరంగా చర్చించాలని వినయ్ రాజ్యసభలో డిమాండ్ చేశారు.

2.ఆర్యవైశ్యులను ఆదుకుంటాం : లోకేష్

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol

ఆర్యవైశ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు .ఆయన చేపట్టిన యువ గళం పాదయాత్ర నేడు ఏడవ రోజు కొనసాగుతోంది.

3.హైదరాబాద్ లో గోదాములపై కీలక నిర్ణయం

హైదరాబాద్ నగరంలోని పలు గోదాములలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో, గోదాములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న వేలాది గోదాములను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

4.టాలీవుడ్ సీనియర్ దర్శకుడు మృతి

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు విద్యాసాగర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.

5.అహ్మదాబాద్ తిరుచ్చి ఎక్స్ప్రెస్ కొనసాగింపు

అహ్మదాబాద్ తిరుచ్చి మధ్య ప్రత్యేక రైలు కొనసాగిస్తున్నట్లు దర్శన్ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

6.బాలిక వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol
Advertisement

బలవంతంగా బాలికకు వివాహం చేస్తుండగా హయత్ నగర్ పోలీసులు అడ్డుకున్నారు.అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి చైల్డ్ హెల్ప్ లైన్ సభ్యుల ద్వారా కౌన్సిలింగ్ చేశారు.

7.మహిళా కమిషన్ చైర్ పర్సన్ తొలగింపు

పంజాబ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.

8.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

9.తెలంగాణ అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు

 రేపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేపథ్యంలో రేపు ఉదయం 9 నుంచి 3:00 వరకు అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

10.మంత్రులకు ఈటెల రాజేందర్ సవాల్

తెలంగాణ మంత్రులకు దమ్ముంటే నేను చెప్పే లెక్కల మీద చర్చకు రావాలని బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు.

11.నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జి నియామకం

నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జిగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి జగన్ నియమించారు.

12.సీనియర్ కెమెరామెన్ కి చిరంజీవి సాయం

తెలుగు, తమిళ, బెంగాలీ మలయాళ భాషల్లో దాదాపు 300 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన దేవరాజ్ అనే సీనియర్ కెమెరామెన్ అనారోగ్యానికి గురికావడంతో మెగాస్టార్ చిరంజీవి దేవరాజును పిలిపించి ఆయనకు ఐదు లక్షల రూపాయలు సాయం అందించారు.

13.కేటీఆర్ కామెంట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు వెళుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

14.దుర్గగుడి ఈవో కు హైకోర్టు నోటీసులు

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబకు ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.కరోనా సమయంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని న్యాయస్థానం ఆ నోటీసుల్లో పేర్కొంది.

15.తమిళనాడులో స్కూళ్లకు సెలవులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో అకాల వర్షాలు కురుస్తున్నాయి.ఈ ప్రభావంతో స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

16.విద్యాశాఖ పై నేడు జగన్ సమీక్ష

Advertisement

విద్యా శాఖపై ఏపీ సీఎం జగన్ నేడు సమీక్ష నిర్వహించారు.

17.కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్

ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది.పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

18.షర్మిల పాదయాత్ర ప్రారంభం

నేటి నుంచి వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది.

19.నేడు మహారాష్ట్రకు తెలంగాణ మంత్రి

ఈరోజు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లనున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -53,600 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 58,470.

తాజా వార్తలు