న్యూస్ రౌండప్ టాప్ 20

1.వరద ముంపు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలి

తెలంగాణలోని ముంపు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని టిఆర్ఎస్ ప్రభుత్వంను ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే దనసరి సీతక్క డిమాండ్ చేశారు.

 

2.బోనాల మహోత్సవం

  సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు మహోత్సవం  

3.వరద బాధితులను పరామర్శిస్తున్న గవర్నర్

  తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తూ వరద బాధితులను పరామర్శిస్తున్నారు. 

4.కాంగ్రెస్ సిపిఎం నేతల హౌస్ అరెస్ట్

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ సిపిఎం నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన దృష్ట్యా ఈ నిర్ణయం  తీసుకున్నారు. 

5.తిరుమలకు వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యం

  తిరుమల బస్సుల్లో వెళ్లే భక్తులకు టిఎస్ఆర్టిసి ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది జులై 1 నుంచి ఆర్టిసి బస్సు టికెట్ రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్ ను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. 

6.మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ని అడ్డుకున్న పోలీసులు

  భారీ వరదకు నీట మునిగిన కాలేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్ హౌస్ పరిశీలనకు వెళ్ళిన సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ నాయకుడు,  మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని పోలీసులు అడ్డుకున్నారు. 

7.సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణకు డాక్టరేట్

  తెలంగాణ భాష సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ జానపద , గిరిజన విజ్ఞాన పీఠం డాక్టరేట్ ను ప్రకటించింది. 

8.బూస్టర్ డోస్ తీసుకున్న గవర్నర్

Advertisement

  తెలంగాణ గవర్నమెంట్ తమిళ సై సౌందరారాజన్  కోవిడ్-19 బూస్టర్ డోస్  వేయించుకున్నారు. 

9.వరద ముంపు ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్ లు

   వరద ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికను హెల్త్ క్యాంపులను నిర్వహించాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులందరికీ సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 

10.విజయశాంతి సెటైర్లు

  సీఎం కేసీఆర్ పాలన ఆక్రమణలకు మారిందని బిజెపి నాయకురాలు విజయశాంతి విమర్శించారు. 

11.ఇంజనీరింగ్ పరీక్షలు

  తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడం పరిస్థితులు అదుపులో ఉండడంతో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.18 19 తేదీల్లో పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

12.భీమవరంలో జనవాణి నిర్వహించిన పవన్

  ప్రజా సమస్యల పరిష్కరించడమే జనసేన లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 

13.కర్నూల్ లో చిరుత పులి కలకలం

  కర్నూలు జిల్లాలోని కొసిగి తిమ్మప్ప కొండపై రెండు చిరుతల  సంచారం కలకలం రేపుతోంది.కుక్కలు, గొర్రెలను చిరుతపులులు తింటున్నాయని,  బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

14.నేడు రేపల్లెకు టీడిపి నిజ నిర్ధారణ కమిటీ

  నేడు రేపల్లె కు టిడిపి నిజ నిర్ధారణ కమిటీ వెళ్తోంది.

కమిటీలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్సీ అశోక్ బాబు టిడిపి నేత పట్టాభి బుద్ధ వెంకన్న ఉన్నారు.రెండు రోజుల క్రితం పోర్టు మెరకలో మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన ఘటనపై నిజం నిర్ధారణ కమిటీ రంగంలోకి దిగింది. 

15.వరద బాధితులను 10 వేల ఆర్థిక సాయం

  వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ సీఎం కేసీఆర్ పరిశీలించారు.వరద బాధితులకు తక్షణ సాయం కింద కుటుంబానికి 10 వేలు అందులిస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

16.వరద బాధితులకు శాశ్వత కాలనీలు

  వెయ్యి కోట్లతో తెలంగాణలోని వరద బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 

17.అమ్మవారికి  బోనం సమర్పించిన కవిత

  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. 

18.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,528 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

19.వరద ప్రభావిత జిల్లాలకు అదనపు నిధులు విడుదల

  ఏపీలో గోదావరి నది పోటెత్తుతూ ఉండడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు చెరో రెండు కోట్లు అదనపు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 

20.తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు

  నేడు రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. .

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు