ఆ హీరోతో చాలా కంఫర్ట్ గా ఉంటుంది... అదే నా వీక్ నెస్... అనుష్క శెట్టి కామెంట్స్ వైరల్!

సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి(Anushka Shetty) .

ఇలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో నటిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇక ఈ సినిమా తర్వాత అనుష్క పెద్దగా సినిమాలను చేయలేదని చెప్పాలి.

ప్రస్తుతం ఈమె యువి క్రియేషన్ బ్యానర్లో(UV Creation Banner) వస్తున్నటువంటి మిస్ శెట్టి మిస్టర్ పోలీశెట్టి (Ms Shetty Mr Polishetty) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.అనుష్క తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు.అదేవిధంగా తన ఫస్ట్ లవ్ ప్రపోజల్ (First Love Praposal) గురించి కూడా ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

Advertisement

ఈ క్రమంలోనే అనుష్క మాట్లాడుతూ తాను ఆరో తరగతి చదివే సమయంలోనే తన క్లాస్మేట్ ఒక అబ్బాయి తన వద్దకు వచ్చి ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేశారని తెలిపారు.అయితే నాకు ఐ లవ్ యు అంటే ఏదో తెలియక ఓకే అని చెప్పానని అనుష్క తెలియజేశారు.

కానీ అది నాకు ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోయిందని ఈమె తెలిపారు.

ఇక ఇండస్ట్రీలో ఉన్నటువంటి తన ఫేవరెట్ హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ తనకు త్రిష, నయనతార, భూమిక నటన చాలా బాగా నచ్చుతుందని నటనపరంగా కాకుండానే వీరి వ్యక్తిత్వం కూడా నచ్చుతుందని అనుష్క తెలియజేశారు.ఇక ఈమె హీరోల గురించి మాట్లాడుతూ నాగార్జున (Nagarjuna) గారితో నటించడం తనకు చాలా కంఫర్ట్ గా ఉంటుందంటూ ఈ సందర్భంగా అనుష్క చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె నాగార్జునతో కలిసి పలు సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇక అనుష్క తన వీక్నెస్ గురించి కూడా చెప్పుకొచ్చారు.తనకు ఫోన్ క్యారీ చేయడం అసలు చేతకాదని అదే తన వీక్ నెస్ అంటూ ఈ సందర్భంగా అనుష్క చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు