5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా ఆ ఆఫర్ కు నో చెప్పిన అనుష్క.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ( Anushka Shetty )గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ముఖ్యంగా తెలుగులో ప్రభాస్ నాగార్జున మహేష్ బాబు, లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్ కీ తగ్గ సినిమా మరి ఏది చేయలేదు.

Anushka Shetty Rejects 5 Crore Offer Star Hero Movie, Anushka Shetty, Reject 5 C

ప్రస్తుతం కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది స్వీటీ.ఇకపోతే తాజాగా స్వీటీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే కొద్దిరోజుల క్రితం స్వీటీకి ఐదు కోట్ల ఆఫర్ రాగా ఆమె దానిని రిజెక్ట్ చేసిందట.

Advertisement
Anushka Shetty Rejects 5 Crore Offer Star Hero Movie, Anushka Shetty, Reject 5 C

ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.కొన్నాళ్ల క్రితం తెలుగు స్టార్ సినిమాలో ఆఫర్ ఈమె దగ్గరకు వచ్చిందట.రూ.5 కోట్ల రెమ్యునరేషన్( Remuneration ) కూడా ఇ‍స్తామన్నారట.కానీ అనుష్క నో చెప్పేసిందట.

Anushka Shetty Rejects 5 Crore Offer Star Hero Movie, Anushka Shetty, Reject 5 C

ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్లే అనుష్క నో చెప్పినట్లు తెలుస్తోంది.దీనిని బట్టి చూస్తే అనుష్క ఎన్నాళ్లు నటిస్తుందో తెలియదు గానీ ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం పాత్ర ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేయాలని ఆమె ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే మొన్నటి వరకు అనుష్క సినిమాలకు దూరంగా దొరకడంతో ఆమెకు పెళ్లి ఫిక్స్ అయిందని, బరువు తగ్గడం కోసమే ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు