చెఫ్ గా మారుతున్న అనుష్క..!

స్వీటీ అనుష్క నిశ్శబ్ధం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.

నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్న అనుష్క ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

అనుష్క సినిమాలో ఉంది అంటే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది.మహేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనుష్క ఇంటర్నేషనల్ చెఫ్ గా కనిపిస్తుందని తెలుస్తుంది.

సినిమాలో అనుష్క పాత్ర వెరైటీగా ఉంటుందని అంటున్నారు.చెఫ్ గా అనుష్క చేస్తున్న ఈ సినిమాలో హీరో నవీన్ పొలిశెట్టి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తారని తెలుస్తుంది.

మొత్తానికి స్టార్ హీరోయిన్ అనుష్కతో యువ హీరో నవీన్ పొలిశెట్టి రొమాన్స్ చేయనున్నాడు.సినిమాలో హీరో హీరోయిన్ క్యారక్టరైజేషన్స్ వెరైటీగా ఉంటాయని తెలుస్తుంది.

Advertisement

జాతిరత్నాలు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి ఇప్పటికే సితార బ్యానర్ లో, స్వప్న సినిమాస్ బ్యానర్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు. కుర్రాడి స్పీడ్ చూస్తుంటే త్వరలోనే స్టార్ క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నాడని చెప్పొచ్చు.

 కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నవీన్ పొలిశెట్టి రానున్న రోజుల్లో మరెన్ని సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు. .

Advertisement

తాజా వార్తలు