నేను రెండు వారాలు మాత్రమే బతుకుతానని చెప్పారు.. బర్ఫీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?

దర్శకుడు అనురాగ్ బసు గురించి మనకి తెలిసిందే.బర్ఫీ, లూడో, జగ్గా జసూస్‌ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు అనురాగ్‌ బసు.

ఈయన 2004లో బ్లడ్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయం తెలిసిందే.అయితే అతడిని పరీక్షించిన వైద్యులు కేవలం రెండు వారాలు మాత్రమే బతుకుతాడని చెప్పారట.

ఆ తరువాత జరిగిన సంఘటనల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు అనురాగ్ బసు.ఆ సమయంలో తన భార్య ఏడు నెలల గర్భిణి అని తెలిపారు.ఓసారి తనకు నోటి నిండా పొక్కులు వచ్చినప్పటికీ,షూటింగ్‌ ఉండటంతో నేరుగా సెట్స్‌కే వెళ్లాడట.

కానీ ముకేశ్‌ భట్‌ మాత్రం ఈ రోజు షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పేసి వెళ్లిపో అన్నాడు.మాములుగా అతడు ఎప్పుడూ అలా చెప్పడు.ఆ తర్వాత హాస్పిటల్‌లో చెకప్‌ చేయించుకున్నాను.

Advertisement

అప్పుడు మా పేరెంట్స్‌ ముఖం చూశాక ఏదో చెడు జరుగుతోందనిపించింది.క్యాన్సర్‌ అని బయటపడింది.

మొదట్లో కొంచెం తలనొప్పితో పాటు నీరసంగా అనిపించేది.అయినా సరే ఇమ్రాన్‌ హష్మీతో కలిసి బీర్‌ తాగేందుకు హాస్పిటల్‌ గది నుంచి బయటకు తప్పించుకుని వచ్చేవాడిని.

అయితే రానురానూ నా పరిస్థితి దిగజారిపోయింది.మందులు పనిచేయలేదు.

నా పేరెంట్స్‌ నన్ను ఆ స్థితిలో చూసి తట్టుకోలేక కలవడమే మానేశారు.అంతర్గతంగా రక్తస్రావం అధికం కావడంతో చాలామంది నాకు రక్తదానం చేశారు.

Hair Care Tips Dry Hair : డ్రై, డ‌ల్‌, ర‌ఫ్ అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

ఓసారి మహేశ్‌ భట్‌ వచ్చి నా తలపై చేయి వేసి నిమిరాడు.అప్పుడు అతని చేతులు వణికాయట.

Advertisement

ఆ తరువాత అనుపమ్‌ ఖేర్‌ కూడా నన్ను కలవడానికి రావడంతో అప్పుడు అతనికి పరిస్థితి చేయిదాటుతోందని అర్థమయ్యిందట.అప్పుడు అతని ముఖం వాచి,శ్వాస తీసుకోవడం కూడా కష్టమైందట.ఊపిరి కూడా సరిగా ఆడకపోవడంతో విలవిల్లాడిపోయాడట.

ఆ సమయంలో అతనికి ఎటువంటి చికిత్స కూడా పని చేయలేదట.కానీ అతనికి ఆ పరిస్థితి వచ్చినా కూడా మొదట్లో అతని భార్యకు చెప్పలేదట.

కానీ టీవీ ఛానల్ ద్వారా ఆమెకు అతని విషయం తెలిసి ఆ తరువాత అతని వెంటే ఉందట.టాటా మెమోరియల్‌ ఆస్పత్రికి షిఫ్ట్‌ చేసి నన్ను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు.అప్పుడు నాకు ఒక బెడ్‌ కూడా దొరకలేదు.

కానీ సునీల్‌ దత్‌ నాకోసం ఒక బెడ్‌ ఏర్పాటు చేశాడు.అప్పుడు నాకు బెడ్‌ మీదే వైద్యం అందించారు.

కీమోథెరపీ చేశారు.ఇండస్ట్రీలో ఉన్నందుకే నాకు అంత త్వరగా బెడ్‌ దొరికి వైద్యం అందించగలిగారు అని చెప్పుకొచ్చారు అనురాగ్ బసు.