Anupama Parameswaran : ఒంటరిగా అడవులలో సాహసం చేస్తున్న అనుపమ.. ధైర్యవంతురాలే అంటున్న నేటిజన్స్?

ప్రేమమ్ ( Premam ) సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) మొదటి సినిమాతోనే ఎంతగానో మెప్పించినటువంటి ఈమె తదుపరి వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.

ఈమె కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ భాష చిత్రాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు.

ప్రస్తుతం తెలుగులో ఈమె వర్సెస్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవల ఈగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె టిల్లు స్క్వేర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు( Tillu Square ) సినిమాకు సిగ్నల్ చిత్రంగా రాబోతున్నటువంటి సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ అవకాశం అందుకున్నారు.ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కనుక చూస్తే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) బోల్డ్ పర్ఫామెన్స్ చేశారని తెలుస్తోంది.

ఎన్నడూ లేని విధంగా అనుపమ.టూ మచ్ బోల్డ్‌ గా నటించింది.హద్దులు చెరిపేసి రెచ్చిపోయింది.

Advertisement

ఇకపోతే ఇటీవల కాలంలో అనుపమ సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో రచ్చ చేస్తున్నారు.

ఎంతో పద్ధతిగా ఇన్ని రోజులు కనిపించి ఇటీవల కాలంలో భారీగా గ్లామర్ షో చేస్తూ పొట్టి దుస్తులను ధరిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉండడంతో అభిమానులు ఈమె వ్యవహార శైలి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తూ అభిమానులను సందడి చేస్తున్నటువంటి ఈమె తాజాగా ఒంటరిగా అడవులలో పెద్ద ఎత్తున సాహసాలు చేస్తూ కనిపించారు.

తాజాగా ఈ కేరళ కుట్టి తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేసుకుంది.ఈ వీడియోలో స్కై డ్రైవింగ్‌, స్కై రోప్‌ సైకిలింగ్‌, కార్ రేస్, వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయడం, అడవిలో జంతువులను చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.అడవిలో టైగర్ ని కూడా అనుపమ దగ్గర నుంచి చూస్తూ విడియోకి స్టిల్ ఇచ్చింది.

అమాయకంగా కనిపించే అనుపమలో ఇంత ధైర్యం ఉందా ఆ పులిని అంత దగ్గరగా చూసిన తనలో ఏ మాత్రం భయం కనిపించడం లేదు అంటూ ఈమె ధైర్య సాహసాలపై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు