Tillu Square Anupama Parameswaran : టిల్లు స్క్వేర్ బోల్డ్ సీన్స్ పై స్పందించిన అనుపమ.. చాలా ఇబ్బంది పడ్డాను అంటూ?

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నటువంటి అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran ) త్వరలోనే టిల్లు స్క్వేర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

గత రెండు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఇక ఇప్పటివరకు అనుపమ ఎన్నో సినిమాలలో నటించిన ఎప్పుడూ కూడా బోల్డ్ రొమాంటిక్ సీన్స్( Bold Romantic Scenes ) మాత్రం చేయలేదు కానీ ఇటీవల ఈమె కాస్త బోల్డ్ సీన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఇక టిల్లు స్క్వేర్ సినిమాలో నటుడు సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) తో కలిసి ఈమె భారీ స్థాయిలో రొమాన్స్ చేశారు.ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్( (Tillu Square Trailer ) లో ఈమె కారులో సిద్దూతో కలిసి ఘాటు లిప్ లాక్ సీన్లలో నటించింది.దీనిపై  ఆమె మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులభం కాదని తెలిపారు.చుట్టూ 100 మంది ఉంటారు అంతమంది ముందు మేమిద్దరం రొమాన్స్ చేయాలి అంటే చాలా కష్టమని తెలిపారు.

Advertisement

ప్రతి ఒక్కరు కూడా కార్ సీన్ గురించి మాట్లాడుతున్నారు ఆ సీన్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు.చుట్టూ వంద మంది ఉండగా కారులో రొమాన్స్( Car Roomance ) చేసే సమయంలో తన మోకాలికి బాగా గాయాలు అయ్యాయని ఆ బాధను భరిస్తూ బయటకు మాత్రం రొమాంటిక్ ఫీల్ వచ్చేలా నటించడం సులభం కాదు.అలాంటి పరిస్థితులలో రొమాన్స్ చేయడం అనేది చాలా కష్టతరమని ఈ సందర్భంగా ఆ కారు సన్నివేశం గురించి అనుపమ మాట్లాడుతూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా మార్చి 29వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

Advertisement