నేషనల్ అవార్డు విషయంలో ట్రోల్ అవుతున్న బన్నీ.. ఇలా దొరికిపోయాడేంటీ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ఇటీవల బాలకృష్ణ( Balakrishna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ( Un Stoppable ) కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ అవార్డు గురించి ప్రస్తావనకు వచ్చింది.

అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డు ( National Award )అందుకున్నారు.ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఏకైక వ్యక్తి అల్లు అర్జున్ అని చెప్పాలి.

ఇక ఈ విషయం గురించి బన్నీ మాట్లాడుతూ నేను నేషనల్ అవార్డు ఎవరికి వచ్చింది అంటూ లిస్ట్ చూద్దామని చెక్ చేస్తే ఒక్కరికి కూడా నేషనల్ అవార్డు రాలేదు.ఆ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను అప్పుడే ఎలాగైనా దీనిని కొట్టాలని ఫిక్స్ అయ్యాను.

Anti Fans Trolls Allu Arjun On National Award , Allu Arjun, National Award, Bala

నేషనల్ అవార్డు దిశగానే ప్రయత్నాలు చేశానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు.అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ భారీ స్థాయిలో ట్రోల్ అవుతున్నారు.గతంలో నేషనల్ అవార్డు గురించి ఈయన చేసిన ఒక వీడియోని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement
Anti Fans Trolls Allu Arjun On National Award , Allu Arjun, National Award, Bala

ఇందులో ఈయన నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు.

Anti Fans Trolls Allu Arjun On National Award , Allu Arjun, National Award, Bala

నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పడంతో ఈ అవార్డు అందుకుంటున్న టాలీవుడ్ హీరోలలో నేను ఏ మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తినో అనుకున్నాను కానీ నేనే మొదటి వ్యక్తి అని టీవీలో చెప్పే వరకు నాకు తెలియదు.ఆ క్షణం నాకు చాలా షాకింగ్ అనిపించింది అంటూ అల్లు అర్జున్ గతంలో నేషనల్ అవార్డు గురించి తెలిపారు.ఇలా ఈ అవార్డు విషయంలో అల్లు అర్జున్ విభిన్న రకాలుగా మాట మారుస్తూ మాట్లాడటంతో యాంటీ ఫ్యాన్స్ ఇదే అదునుగా తనపై విమర్శలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు