ఆంటోని ఫౌచీ సంచలన వ్యాఖ్యలు...అమెరికాలో లాక్ డౌన్ తప్పదా..అదే జరిగితే..!!

అమెరికాలో డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదల అక్కడి ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.అమెరికన్స్ భయపడుతున్నట్టుగానే గత కొంత కాలంగా డెల్టా కేసుల పెరుగుదల లాక్ డౌన్ దిశగా వెళ్తుందా అనే సందేహాలని కలిగిస్తోంది.

ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసులు 3.5 కోట్లు కాగా, మృతుల సంఖ్య 6 లక్షలకు పైగానే ఉంది.డెల్టా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో భవిష్యత్తులో లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత తక్కువ మరణాలు నమోదు అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదిలాఉంటే అమెరికాలో ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మరో సారి లాక్ డౌన్ చర్చ తెరపైకి వచ్చింది.మళ్ళీ అమెరికాలో లాక్ డౌన్ తప్పదని, కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోందని, మాస్క్ లు అవసరం లేదని చెప్పిన బిడెన్ ఇప్పుడు మాస్క్ లు పెట్టుకోవాలని సూచించడం లాక్ డౌన్ లో భాగమేనంటూ చర్చలు జరగడంతో ఆందోళన వాతావరం నెలకొంది.

మొదటి వేరియంట్ లో పెట్టిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికి తెలిసిందే ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయారు ఈ పరిస్థితి మళ్ళీ పునరావృతం అయితే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాపారాలు, సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గత లాక్ డౌన్ నష్టం నుంచీ పూర్తిగా కోలుకోలేదని, మళ్ళీ లాక్ డౌన్ పెడితే జీవన పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ నేపధ్యంలో అమెరికా అంటువ్యాధుల నిపుణుడు అంటోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికాలో డెల్టా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని, ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించాలి సూచించారు.

Advertisement

అయితే అమెరికాలో మరో సారి లాక్ డౌన్ పెట్టే పరిస్థితులు కనపడటం లేదని, భవిష్యత్తులో అలాంటి అవకాశం ఉండకపోవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు వదంతులు నమ్మకుండా వ్యాక్సిన్ వేసుకునే పనిలో ఉండాలని సూచించారు.

వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రజలు కరోనా బారిన పడకుండా కాపాడుతుందని సూచించారు.

Advertisement

తాజా వార్తలు