లోన్ యాప్ వేధింపుల‌కు మరొక‌రు బ‌లి

ఏపీలో లోన్ యాప్ నిర్వాహ‌కులు వేధింపుల‌కు మ‌రో యువ‌కుడు బ‌ల‌య్యాడు.పల్నాడు జిల్లా దాచేప‌ల్లి నారాయ‌ణ‌పురంలో వెంక‌ట కృష్ణ అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా రూ.8 వేలు తీసుకున్నాడు.ఈ క్ర‌మంలో రూ.20 వేలు క‌ట్టాలంటూ యాప్ సిబ్బంది వేధింపుల‌కు గురి చేశారు.దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన వెంట‌క కృష్ణ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాడు.

లోన్ యాప్ నిర్వాహ‌కులు వేధింపులు తాళ‌లేక నిన్న రాజ‌మండ్రిలో దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?