శామ్‌సంగ్ నుంచి మరో అప్డేట్.. మార్కెట్‌లోకి స్మార్ట్ మానిటర్ M8 లాంచ్

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్‌సంగ్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లతో తమ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తుంది.

మొబైల్ ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీ, వాషింగ్ మెషిన్లు, ఏసీల లాంటి అనేక ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌ తయారీలో శామ్ సంగ్ అగ్రస్థానంలో ఉంది.

ఎప్పటిప్పుడు కొత్త వెర్షన్లలో ప్రొడక్ట్స్‌ను తీసకొస్తుంది.ఈ క్రమంలో తాజాగా ఇండియన్ మార్కెట్ లోకి కొత్త స్మార్ట్ మానిటరింగ్ టీవీని లాంచ్ చేసింది.

కొత్త అప్‌డేట్‌లు జోడిస్తూ తయారుచేసిన (Samsung Smart Monitor M8)టీవీని భారత మార్కెట్ లోకి విడుదల చేసింది.ఈ మానిటర్ స్మార్ట్ టీవీలాగే పనిచేయడంతో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి.

ఈ మానిటరింగ్ టీవీ ధర, ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఈ మానిటరింగ్ టీవీ ధర రూ.60 వేలుగా ఉంది.ఆన్ లైన్ లేదా శామ్‌సంగ్ దుకాణాలతో పాటు ఇతర రిటైల్ దుకాణాలలో ఈ టీవీని కొనుగోలు చేయచ్చు.జూన్ 15 నుంచి ఇది అందుబాటులోకి రానుంది.ప్రీ బుకింగ్ చేసుకున్నవారు రూ.12 వేల విలువైన గెలాక్సీ బడ్స్2, రూ.3,499 విలువైన శామ్ సంగ్ స్మార్ట్ వైర్ లెస్ కీబోర్డ్, రూ.3 వేల విలువైన ఇన్ స్టంట్ కార్ట్ ఉచితంగా పొందవచ్చు./br>ఫీచర్లు ఇవే-32-అంగుళాల 4K డిస్‌ప్లేతో పాటు 3840×2160 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో HDR 10+ సపోర్ట్ చేస్తుంది.

Advertisement

-అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీతో పాటు అన్ని ఓటీటీ సేవలను పొందవచ్చు - ఇక ఫ్లాట్ బ్యాక్‌ వైట్, బ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది.దీని ద్వారా మానిటర్ హైట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.-ఇక స్మార్ట్ ఫోన్ కి కూడా దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు -వక వైఫై ద్వారా వివిధ అప్లికేషన్లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు -గూగుల్ డ్యుయో ద్వారా హెచ్ డీ కెమెరా ద్వారా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు - ఇక 2.2-ఛానల్ 5W స్పీకర్‌, వైర్‌లెస్ ఆడియో డివైజ్‌లను కనెక్ట్ చేయడానికి బ్లూటూత్‌ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.

షాలిని మణికట్టు కోసిన హీరో అజిత్.. చివరికి పెళ్లి పీటలు ఎక్కారు
Advertisement