బీజేపీ నేత జితేందర్ రెడ్డి మరో ట్వీట్

బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి మరో ట్వీట్ చేశారు.దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ కు సపోర్ట్ గా జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారని తెలుస్తోంది.

రఘునందన్ ను జాతీయ అధికార ప్రతినిధి చేయాలనే డిమాండ్ కు మద్ధతు తెలుపుతున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.అయితే ఎమ్మెల్యే రఘునందన్ రావు గత కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

నిరంతరం పార్టీ కోసం కష్టపడుతున్న తనను పార్టీ అధినాయకత్వం గుర్తించలేదని, జాతీయ అధికార ప్రతినిధి చేయాలన్న వినతిని పట్టించుకోలేదని ఆయన వాపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రఘునందన్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు