Director Madan Krishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. డైరెక్టర్ మదన్ మృతి!

ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఏడాదిలో ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు మరణించి ఇండస్ట్రీకి తీరనిలోటు కలిగించారు.

లెజెండ్రీ నటులైనటువంటి కృష్ణ కృష్ణంరాజు రెండు నెలల వ్యవధిలోనే మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.అక్టోబర్ 15వ తేదీ అనారోగ్య సమస్యల కారణంగా సీనియర్ నటుడు నటశేఖరుడు కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే.

ఈయన మరణ వార్త మర్చిపోకముందే తెలుగు చిత్రపరిషంలో మరో విషాదం చోటు చేసుకుంది.తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా దర్శకుడుగా కొనసాగుతున్నటువంటి డైరెక్టర్ మదన్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించారు.

ఈయన ఇండస్ట్రీలో ఆ నలుగురు చిత్రానికి రచయితగా పనిచేశారు.ఇలా రచయితగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న పెళ్లయిన కొత్తలో సినిమాకి దర్శకుడుగా వ్యవహరించారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈయన గుండె జల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

ఇక ఈయన స్వస్థలం మదనపల్లి కాగా సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు.నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన హైదరాబాద్లోనే అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.ఇలా ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకోవడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.అయితే మదన్ గతంలోనే ఓ పెద్ద ప్రమాదం నుంచి బ్రతికి బయటపడినప్పటికీ ఇలా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించారు.2015 వ సంవత్సరంలో ఈయన యువనిర్మాత నాగిరెడ్డితో కారులో ప్రయాణిస్తుండగా ఘోర ప్రమాదానికి గురయ్యారు.ఆ సమయంలో మదన్ కారు డ్రైవింగ్ చేస్తూ ఆగి ఉన్న వాహనానికి ఢీ కొట్టారు.

ఈ ప్రమాదంలో డైరెక్టర్ మదన్ బ్రతికి బయటపడగా యంగ్ ప్రొడ్యూసర్ నాగిరెడ్డి మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.అయితే ప్రస్తుతం ఈయన బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించడంతో పలువురు సినీ సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఈయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు