విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్..!!

విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ మేరకు టీడీపీ నేత నారా లోకేశ్ కు ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని సీఐడీ కోర్టును కోరింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ పై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఇదే కేసులో లోకేశ్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో 41 ఏ నోటీస్ ఇచ్చిన తరువాత విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.నారా లోకేశ్ కు ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ అవగా ఈ కేసులో ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.

కాగా సీఐడీ దాఖలు చేసిన ఈ పిటిషన్ మరికాసేపటిలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు