చాపకింద నీరులా హెచ్‌ఎమ్‌పీవీ కేసులు.. భారత్‌లో 18కి చేరిన రోగుల సంఖ్య

భారతదేశంలో హ్యూమన్ మెటాప్‌ న్యూమో వైరస్ (HMPV) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.తాజాగా, పుదుచ్ఛేరిలో( Puducherry ) మరో చిన్నారికి హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

పుదుచ్ఛేరి ఆరోగ్య శాఖ అధికారి రవిచంద్రన్‌ వివరాల ప్రకారం, జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఒక చిన్నారి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో చేరినట్లు చెప్పారు.ప్రస్తుతం ఆ చిన్నారి చికిత్సకు సహకరిస్తోందని అధికారులు తెలిపారు.

Another Child Tests Positive For Hmpv In Puducherry Details, India, Hmpv, Human

ఇక తాజా కేసుతో, పుదుచ్ఛేరిలో హెచ్‌ఎమ్‌పీవీ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది.గత వారంలో మూడేళ్ల చిన్నారి ఈ వైరస్ బారిన పడింది.వైద్యుల కృషితో చికిత్స పూర్తయ్యి, ఆ చిన్నారి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యింది.

దింతో ఇప్పటివరకు భారత్‌లో హెచ్‌ఎమ్‌పీవీ కేసుల మొత్తం సంఖ్య 18 కి చేరింది.ఈ వైరస్ కేసులు రాష్ట్రాల వారీగా ఎలా విస్తరిస్తున్నాయన్నదానిపై ఆరోగ్య శాఖ( Health Department ) ప్రత్యేక ప్రణాళిక వేసింది.

Another Child Tests Positive For Hmpv In Puducherry Details, India, Hmpv, Human
Advertisement
Another Child Tests Positive For HMPV In Puducherry Details, India, HMPV, Human

ఇక ఈ హ్యూమన్ మెటాప్‌ న్యూమో వైరస్( Human Metapneumovirus ) శ్వాస సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఈ వైరస్‌కి అధికంగా గురవుతుంటారు.దీని లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు, మరియు శ్వాస సమస్యలుగా కనిపిస్తాయి.

ఈ వైరస్‌ ప్రబలకుండా ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించడం, శ్వాస సంబంధిత సమస్యలుంటే వైద్యుల్ని సంప్రదించడం చాలా అవసరం.ప్రభుత్వం ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది.

ప్రజలు ఆందోళన చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడం కీలకం.

స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!
Advertisement

తాజా వార్తలు