వైరల్: ఇండియన్ అంజూ ఇంటి ముందు ఏకంగా పాకిస్తాన్ కంపెనీలు క్యూ కట్టాయిగా?

ప్రియుడి గురించి రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి పాకిస్తాన్( Pakistan ) పారిపోయిన అంజు నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది.

అక్కడికి వెళ్లిన తర్వాత ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుని తన ప్రేమికుడు నస్రుల్లాను పెళ్లి కూడా చేసేసుకుంది.

దాంతో ఈ వార్త 2 దేశాల్లో సంచలనంగా మారింది.ఇకపోతే ఈ క్రమంలో పాకిస్తానీ ఆమెపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

అవును, అంజు అకా ఫాతిమా, నస్రుల్లాలకు బహుమతులు ఇచ్చే ప్రక్రియ ఈమధ్యనే మొదలైంది.కుటుంబం, బంధువుల తర్వాత.

ఇప్పుడు పాకిస్తాన్‌కు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నాయి అంటే ఒకింత చోద్యంగానే అనిపించినప్పటికీ ఇది అక్షరాలా నిజం.

Advertisement

తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్త కూడా నస్రుల్లా,( Nasrullah ) అంజులకు( Anju ) విలువైన ప్లాట్‌ను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు.అక్కడితో ఆగిపోలేదు సుమా.ఇతర మతాల నుంచి ఇస్లాంలోకి వచ్చే ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే దీని వెనుక ఉద్దేశమని చెప్పాడం ఇపుడు పెను సంచలనంగా మారింది.

దీంతో పాటు పెద్దమొత్తంలో చెక్కును కూడా అందజేయడం కొసమెరుపు.రాజధాని ఇస్లామాబాద్ నుంచి ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని నస్రుల్లా ఇంటికి బహుమతితో వచ్చిన వ్యాపారవేత్త అంజు అలియాస్ ఫాతిమాకు తన కంపెనీలో ఉద్యోగం కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు.

మరో దేశానికి చెందిన ఓ మహిళ ఇస్లాంను స్వీకరించిందని, అందుకే ఆమెకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడం తమ బాధ్యత అని చెప్పుకొచ్చాడు సదరు వ్యాపారి.

దాంతో సదరు వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.అదంతా ఒకెత్తయితే పాక్ స్టార్ గ్రూప్ ఆమెకు ఉద్యోగం కూడా ఇస్తుందని.ఉద్యోగం( Job ) చేసేందుకు ఆఫీసుకు కూడా రావల్సిన అవసరం లేదని.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఇంట్లో కూర్చొని జీతం తీసుకోవచ్చంటూ చెప్పడం ఒకింత అతిశయంగా మారింది.కాగా రెండు రోజుల క్రితం అంజు తన భర్త అరవింద్‌కు ఫోన్ చేసి బెదిరించింది.

Advertisement

భర్తతో అంజు మాట్లాడుతున్న ఆడియో వైరల్ కావడం అందరికీ తెలిసినదే.రాజస్థాన్‌లో( Rajasthan ) నివసించే అరవింద్‌తో అంజు వివాహం జరిగింది.

అతనికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారు.ఇక అంజు మాయమాటలు చెప్పి పాకిస్థాన్‌కు వెళ్లిపోయిందని భర్త ఆమధ్య పలు మీడియాలముందు వాపోయిన సంగతి విదితమే.

తాజా వార్తలు