ఆ ఆస్తులు తాకట్టు పెట్టి భోళా శంకర్ రిలీజ్ చేసిన నిర్మాత.. మెగాస్టార్ డబ్బులు వెనక్కిస్తారా?

కొన్ని సినిమాల ఫలితాలు విడుదలకు ముందే అర్థమవుతాయి.భోళా శంకర్ మూవీకి మెహర్ రమేష్ డైరెక్టర్ కావడంతో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైంది.

కొన్ని ఏరియాలు మినహా మిగతా ఏరియాలలో నిర్మాత ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు.చిరంజీవి ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ కు ముందు 65 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని సమాచారం అందుతోంది.

హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి అనిల్ సుంకర చిరంజీవికి( Chiranjeevi ) రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.ఏజెంట్ సినిమాతో అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ సుంకర భోళా శంకర సినిమా ఫ్లాప్ రిజల్ట్ తో కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

భోళా శంకర్ సినిమా శాటిలైట్ హక్కులు సైతం అమ్ముడవలేదని సమాచారం.కొన్ని ఏరియాల నుంచి విడుదలకు ముందు మంచి ఆఫర్లు వచ్చినా చిరంజీవి రేంజ్ కు తగిన ఆఫర్లు కాదని నో చెప్పారట.

Advertisement

గతంలో వరంగల్ శ్రీను భారీ సినిమాల హక్కులు కొని నష్టపోగా ప్రస్తుతం అనిల్ సుంకర( Anil Sunkara ) అవే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.చిరంజీవి తన పారితోషికంలో కొంత మొత్తం వెనక్కు ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాకు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో నటించే అవకాశం సాయిపల్లవికి రాగా ఈ సినిమా రీమేక్ సినిమా కావడంతో ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేశారు.ఈరోజుతో భోళా శంకర్ మూవీ ఫుల్ రన్ ముగిసినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అనిల్ సుంకర ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

భోళా శంకర్ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ సీన్లు కూడా లేవు.మెహర్ రమేష్ ను ఈ సినిమా విషయంలో నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు