మహేశ్ కోసం సోనాక్షిని టచ్ చేస్తున్న దర్శకుడు!

సూపర్ స్టార్ మహేశ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాతో ఫుల్ బిజీగా వున్నాడు.

ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే వీరి మధ్య స్టొరీ సిట్టింగ్ కంప్లీట్ కావడం, మహేశ్ స్టొరీ ఫైనల్ చేయడం జరిగిపోయింది అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాని కూడా దిల్ రాజు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు.

ఇదిలా వుంటే కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే సాయి పల్లవి, రష్మిక పేర్లు పరిశీలించిన అనిల్ రావిపూడి ఇప్పుడు బాలీవుడ్ భామల వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో వున్న యువ హీరోయిన్స్ మహేశ్ కాంబినేషన్ గా సెట్ అయ్యే అవకాశం లేకపోవడంతో పాటు, రకుల్ ఇప్పటికే మహేశ్ తో చేసి ఉండటంతో కొత్త పేస్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగానే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాని మహేష్ కి జోడీగా పరిచయం చేస్తే ఎలా వుంటుంది అనే ఆలోచనకి వచ్చి ఆమెని సంప్రదించడం కూడా జరిగింది అని టాక్ వినిపిస్తుంది.అయితే ఈ విషయంలో అనిల్ కి ఇంకా సోనాక్షి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం.

Advertisement
'తులసి' వల్ల ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు

తాజా వార్తలు