ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అనిల్ రావిపూడి...

సినిమా ఇండస్ట్రీలో(film industry) చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు.

ఇక దానికి తగ్గట్టుగానే కొంతమంది ఇక్కడ సూపర్ సక్సెస్ లను సాధిస్తే మరి కొంత మంది మాత్రం సక్సెస్ లను సాధించలేక ఢీలా పడిపోతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాప్ అనేది సర్వ సాధారణంగా వస్తూనే ఉంటాయి.దానివల్ల దర్శకుల కెరీర్ అనేది కొద్ది వరకు ఎఫెక్ట్ అవుతుంది అంతే తప్ప పూర్తిగా వాళ్ల కెరియర్ మీద అయితే ఇంపాక్ట్ ను చూపించకపోవచ్చు.

మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi)లాంటి దర్శకుడు సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)అనే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్(Identity Create) చేసుకోవాలని చూస్తున్నాడు.మరి ఆయన చేసిన ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా భారీ కలెక్షన్లను కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఈ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ అందుకొని వరుసగా ఎనిమిదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే తన మీద ట్రోల్ చేస్తున్న కొంతమందికి కౌంటర్ కూడా ఇచ్చాడు.

Advertisement
Anil Ravipudi Gave A Counter To The Trollers..., Anil Ravipudi, , Trollers, Film

తనది రోటీన్ సినిమాలని, క్రింజ్ కామెడీ ఉంటుందని చాలామంది తనను ట్రోల్ చేస్తున్నారని బేసిగ్గా తనకు పెద్దగా సినిమాకు సంబంధించిన చదువులు చదువుకోలేదని ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అంటే దాంట్లో ఏవైతే ఉండాలో అవన్నీ నా సినిమాలో ఉంటాయి.

Anil Ravipudi Gave A Counter To The Trollers..., Anil Ravipudi, , Trollers, Film

ఒక ప్రేక్షకుడికి సినిమా చూసి విజిల్ వెయ్యాలి అనిపిస్తుంది, క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది అలాంటి హై మూమెంట్స్ తోనే నేను సినిమాలు చేసుకుంటూ వెళ్తాను అయితే దీన్ని క్రింజ్ అని ఎవరేమనుకున్నా నాకు పర్లేదు అంటూ తనకు తాను సెల్ఫ్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నమైతే చేశాడు.ఇక చాలామంది అనిల్ చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు