ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు టైమింగ్స్ మార్పు..!!

రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ నిర్ణయం వర్కౌట్ అవుతున్న సంగతి తెలిసిందే.

కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రారంభంలో దాదాపు పాతిక వేలకు పైగా కొత్త కేసులు రాష్ట్రంలో నమోదు కావడం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేయడంతో ఇప్పుడు 10 వేల కంటే తక్కువగా కేసులు నమోదు పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే ఈ నెల పదవ తారీకు వరకు రెండవ దఫా కర్ఫ్యూ అమలు ఉండగాన కర్ఫ్యూను పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం సరికొత్త టైమింగ్స్ అమలులోకి తీసుకు రావడం జరిగింది.మేటర్ లోకి వెళ్తే జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఇదే తరుణంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కర్ఫ్యూ సడలింపు చేస్తూ మార్పులు తీసుకు రావడం జరిగింది.అంత మాత్రమే కాక ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపెన్ అవుతాయని ప్రభుత్వం పేర్కొంది.

మధ్యాహ్నం రెండు తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ యధాతధంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది.

Advertisement
పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

తాజా వార్తలు