యాంకర్ కాస్త యాక్ట్రెస్ అయితే ఇప్పుడు ఫుల్ డిమాండ్

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది.ఇక ఇప్పుడు యాంకర్స్ ట్రెండ్ నడుస్తోంది అని తెలుస్తోంది.

అదేంటి యాంకర్స్ ట్రెండ్ అర్థం కాలేదు కదా.అది బుల్లితెరపై యాంకర్లుగా రాణించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వారే వెండితెరపై కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ.కుదిరితే ఐటంసాంగ్లో కూడా నర్తిస్తూ.

ఇంకా కుదిరితే హీరోయిన్లుగా కూడా సత్తా చాటు తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.అంతేకాదండోయ్ స్టార్ డైరెక్టర్స్ సైతం ఇక ఇలా బుల్లితెర యాంకర్లను తెగ ఎంకరేజ్ చేస్తూ ఉండటం గమనార్హం.

కాగా ఇప్పటి వరకూ మా టీవీలో కలర్స్ అనే ప్రోగ్రాం లో యాంకర్ గా ప్రత్యక్షమైన స్వాతి ఆ తరువాత అష్టాచమ్మ సినిమాతో హీరోయిన్ గా అవతారమెత్తింది.ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

Advertisement

ఒకప్పుడు యాంకర్గా సత్తా చాటి తన అందం అభినయం వాక్చాతుర్యంతో ఆకట్టుకున్న ఝాన్సీ, ఉదయభాను లాంటి వాళ్ళు సైతం సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.ఝాన్సీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.

ఉదయభాను మాత్రం కొన్ని సినిమాల్లో మెలిసి ఆ తర్వాత కనుమరుగైంది.

హీరోయిన్ గా కెరీర్ మొదలు మొదలుపెట్టి తర్వాత ఫ్యామిలీ కోసం యాంకర్ గా మారి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సుమ జయమ్మ పంచాయతీ సినిమాతో మరోసారి వెండితెరపై ప్రపంచంకనిపించింది.ఇక యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ అమ్మడి ఖాతాలో పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి.

సూపర్ హిట్లు కూడా అందుకుంది.అంతే కాదు సినిమాల ద్వారా వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

గుంటూర్ టాకీస్ అనే సినిమా ద్వారా తన అందాల ఆరబోతతో అందరికీ పిచ్చెక్కించిన రష్మి గౌతమ్ ఆ తర్వాత కాలంలో కొన్ని సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.పటాస్ కార్యక్రమం తో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన యాంకర్ శ్రీముఖి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెండితెరపై కనిపిస్తూనే ఉంది.బిగ్ బాస్ షో ద్వారా పాపులరిటి తెచ్చుకున్న యాంకర్ హరితేజ సైతం సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు