ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ వింధ్యా( Anchor Vindhya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగులో పలు షోలకు అలాగే పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వింధ్య.

ఇకపోతే టాలీవుడ్ లో యాంకర్స్ అందరూ వివిధ రకాల షోలతో దూసుకుపోతుంటే.వింధ్య మాత్రం స్పోర్ట్స్ ఎంచుకున్నారు.

ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు ఆమె హోస్ట్ గా చేస్తూ ఎంతో గుర్తింపు పొందారు.స్పోర్ట్ కి ఒక లేడీ యాంకరింగ్ చేయడం అది కూడా తెలుగులో చాలా అరుదనే చెప్పాలి.

కానీ ఆ ఘనతని యాంకర్ వింధ్య సాధించారు.ఎంటర్టైన్మెంట్ రంగంలో మాత్రం వింధ్యకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

Anchor Vindhya Sensational Comments On Suma Udayabhanu And Jhansi Details, , Anc
Advertisement
Anchor Vindhya Sensational Comments On Suma Udayabhanu And Jhansi Details, , Anc

తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ వింధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది.సుమ( Suma ) లాంటి యాంకర్ అన్ని షోలని చుట్టేస్తూ.ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా ఆమె ఎక్కువగా కనిపిస్తున్నారు.

దీని గురించి ఇంటర్వ్యూలో వింధ్యకి యాంకర్ ప్రశ్న సంధించారు.వింధ్య ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

సుమ అక్క అంటే నాకు చాలా ఇష్టం.సుమక్కని కలసి నప్పుడల్లా ఆమెని సరదాగా సతాయిస్తుంటాం.

మాకు కూడా కొన్ని షోలు వదలొచ్చు కదాని ఫన్నీగా అంటుంటాం.సుమక్కి ఎక్కువ ఆఫర్స్ వస్తున్న మాట నిజమే.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?

కానీ ఒక వేళ ఆ ఆఫర్స్ మనకి వస్తే ఆమె లాగా మేనేజ్ చేయగలమా అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అని తెలిపింది వింధ్య.

Anchor Vindhya Sensational Comments On Suma Udayabhanu And Jhansi Details, , Anc
Advertisement

నిర్మాతలు ఎవరైనా అంత పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు యాంకరింగ్ ( Anchoring ) చాలా ముఖ్యం అని భావిస్తారు.సుమక్క కి అంత రెమ్యునరేషన్ ఇచ్చి ఎందుకు ఆమెనే యాంకర్ గా పెట్టుకుంటారు ? ఆ పర్ఫెక్షన్ ఆమె చూపిస్తుంది.ఎలాంటి మిస్టేక్ లేకుండా ఈవెంట్ ని నడిపిస్తుందనే కదా.ఆమె లాగా ఫర్ఫెక్షన్ చూపిస్తే అందరికీ అవకాశాలు వస్తాయి అని వింధ్య తెలిపింది.అదే విధంగా మరికొందరు యాంకర్స్ ఉన్నారు.

వారు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులతోనే పాపులర్ అవ్వాలనుకుంటారు.తెలుగు( Telugu ) సరిగ్గా మాట్లాడలేరు.

ఒక రకంగా చెప్పాలంటే వారంతా భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ వింధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది.బూతులని, డబుల్ మీనింగ్ కామెడీని వారు జనాలకి అలవాటు చేసేస్తున్నారా అనే సందేహం కలుగుతున్నట్లు వింధ్య విరుచుకుపడింది.

వింధ్య పరోక్షంగా జబర్దస్త్ యాంకర్స్ పై( Jabardasth Anchors ) ఇలా సెటైర్లు వేసిందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ తాజాగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు