స్టార్ హీరోయిన్ లకు మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సుమాకనకాల?

ఇప్పుడు తెలుగు బుల్లితెర పై మకుటం లేని మహారాణిగా విరాజిల్లుతోంధి ప్రముఖ యాంకర్ సుమ కనకాల.

20 సంవత్సరాల క్రితం మలయాళ పరిశ్రమ నుండి టాలీవుడ్ కు విచ్చేసి తెలుగు అమమయిలా అందరితోనూ చాలా చక్కగా కలిసిపోయింది.

అయితే మొదట ఈమె ఒక హీరోయిన్ గా చేసినట్లు దాదాపు చాల మందికి తెలిసి ఉండకపోవచ్చు.టాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ లలో ఒకరైన దాసరి నారాయణరావు తీసిన ఒక సినిమాలో హీరోయిన్ గా ఈమె టాలీవుడ్ కి పరిచయం అయింది.

అలా వచ్చిన సుమ.ఇప్పుడు యాంకరింగ్ లో తనదైన స్వభావంతో అందరినీ వెనక్కు నెట్టేసి యమ స్పీడుగా దూసుకువెళుతోంది.మొన్నటి వరకు తనకు యాంకరింగ్ లో పోటీ దాదాపుగా లేడనై చెప్పాలి.

కానీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో యంగ్ యాంకర్లు వస్తూ సుమకు కొంతమేరకు పోటీ ఇస్తున్నారని తెలుస్తోంది.ఎప్పుడో నటించిన సుమ ఇప్పుడు చాన్నాళ్లకు జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా గత వారమే తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Advertisement

ఈ సినిమా రిలీజ్ కు ముందు వరకు పబ్లిసిటీ తో ఆసక్తి కలిగించినా తీరా థియేటర్ లోకి వచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమాకు థియేట్రిక‌ల్ బిజినెస్ మూడున్నర కోట్లు జరిగింది.

అయితే సుమ వ్యవహారం బుల్లితెర వరకు మాత్రమే అని నిరూపిఒంచిన చిత్రంగా నిలిచిపోయింది.సుమ యాంకర్ గా ఈవెంట్స్, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ ఫంకేషన్స్ లాంటి ఎన్నింటినో చాలా విజయవంతంగా చేస్తూ ఉంటుంది.

అయితే ఈమె ఒక ఈవెంట్ కోసం పారితోషికంగా కనీసం 2 లక్షలు నుండి 5 లక్షల వరకు తీసుకుంటుందట.మరియు ఒక ప్రీ రిలీస్ ఈవెంట్ కు 5 లక్షలు తీసుకుంటుందని సమాచారం.

ప్రస్తుతం సుమ వయస్సు 47 ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ఎంతో ఉత్సాహంగా యాంకరింగ్ చేస్తోంది.కొందరు అయితే ఈమెనే తమ ఈవెంట్ లకు యాంకర్ గా పెట్టుకుంటారట.ఈమె ఒక సంవత్సరంలో ఒక స్టార్ హీరోయిన్ సంపాదించే దాని కన్నా ఎక్కువగానే సుమ తన యాంకరింగ్ ద్వారా ఆర్జిస్తోందట.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

అయితే గడిచిన పది సంవత్సరాలకు చూసుకుంటే సుమ ఒక యాంకర్ గా కోట్లల్లో సంపాదించినదని మీడియా నుండి అందుతున్న సమాచారం.ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.భర్త రాజీ కనకాల కన్నా సుమన్ ఎక్కువగా డబ్బు సంపాదిస్తోంది.

Advertisement

ఇప్పుడు తాజాగా నటించిన జయమ్మ పంచాయితీకి కూడా ఎక్కువగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.