మగపిల్లాడికి జన్మనిచ్చిన ఒకప్పటి స్టార్ యాంకర్

బుల్లితెరపై ప్రముఖ యాంకర్‌గా, డీ డాన్స్ తో రవి, లాస్య జోడీగా భాగా ఫేమస్ అయ్యిన యాంకర్ లాస్య.

తక్కువ టైంలో యాంకర్ తో టెలివిజన్ రంగంలో బెస్ట్ పొజిషన్ కి వెళ్ళిన లాస్య తర్వాత కో స్టార్ రవితో విభేదాల కారణంగా అతని జోడీ నుంచి బయటకి వచ్చి సోలోగా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేసింది.

అదే టైంలో తన బాయ్ ఫ్రెండ్ అయిన మంజునాథ్ ప్రేమ కథ పెళ్లి బంధంలోకి తీసుకొచ్చింది.ఇక తరువాత యాంకరింగ్ దూరం అయిన లాస్య భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది.

మళ్ళీ ఈ మధ్య కాలంలో లాస్య తన సొంత యుట్యూబ్ చానల్ తో ప్రేక్షకులని పలకరిస్తుంది.ఇదిలా ఉంటే ఆ మధ్య తాను గర్భవతి అని ఫోటోలు రిలీజ్ చేసిన లాస్య తాజాగా ఓ బిడ్దకి జన్మనిచ్చినట్లు తెలుస్తుంది.

సరిగ్గా ఉగాది నాడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈ మేరకు తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది.14 గంటల ప్రసవ వేదన అనంతరం బిడ్డను చూసుకున్నానంటూ లాస్య తన పోస్టులో పేర్కొంది.ఈ ఉగాది తమకు ఎంతో ప్రత్యేకమని వెల్లడించింది.

Advertisement

ఇక ఈ పోస్ట్ చూసి చాలా మంది లాస్య ఫ్యాన్స్ ఆమెకి విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు
Advertisement