అలాంటి షోలు పిల్లలకు ఎవరు చూపించమన్నారు... చిన్మయికి కౌంటర్ ఇచ్చిన అనసూయ?

జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ( Anasuya ) ప్రస్తుతం ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు వెండి తెర సినిమా అవకాశాలలో కూడా నటిస్తున్నారు.

ఇక త్వరలోనే ఈమె నటించిన శింబా ( Simbaa ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న అనసూయను విజయ్ దేవరకొండ ప్రస్తావనకు తీసుకు రావడంతో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఫాన్స్ మరోసారి ఈమెపై ట్రోల్స్ మొదలుపెట్టారు.

Anchor Anasuya React On Chinmayi Comments, Chinmayi, Anasuya, Lip Kiss, Tv Show

ఈ క్రమంలోనే గతంలో అనసూయకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు ఇందులో భాగంగా ఓ షోలో పిల్లలతో ఈమె లిప్ లాక్ పెట్టించుకున్న వీడియో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై సింగర్ చిన్మయి ( Chinmayi ) స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా చిన్న పిల్లలతో ముద్దులు పెట్టించుకోవడం ఏంటి ఇలా ముద్దులు పెట్టించుకోవటం వినోదమా పైగా అక్కడున్న వారందరూ చప్పట్లు కొడుతున్నారు అంటూ మండిపడ్డారు.పిల్లల ద్వారా ఇలాంటివి చేయటం వారిపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయంటూ ఈమె మండిపడ్డారు.

Anchor Anasuya React On Chinmayi Comments, Chinmayi, Anasuya, Lip Kiss, Tv Show

ఇలా యాంకర్ పేరు ప్రస్తావించకుండా సింగర్ చిన్మయి ఇలాంటి కామెంట్స్ చేయడంతో అనసూయ సైతం తణుకు కౌంటర్ ఇస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.చిన్నపిల్లలతో ఇలాంటి షోలు చేయడం ఎంటర్టైన్మెంట్ అని కొందరు భావిస్తారు మరికొందరు భావించరు ఎవరి ఇష్టం వారిది కానీ నేను కూడా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానని తెలిపారు.నేను అక్కడ నవ్వకపోయినా ఎడిటర్ వారికి నచ్చినట్టుగా ఎడిట్ చేసుకుంటారని తెలిపారు.

Advertisement
Anchor Anasuya React On Chinmayi Comments, Chinmayi, Anasuya, Lip Kiss, Tv Show

అయినా పిల్లలకు ఇలాంటి షోలు ఎవరు చూపించమన్నారు.వారికోసం కార్టూన్ ఛానల్ ఉన్నాయి కదా వాటిని చూపించొచ్చు అంటూ అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు