Anasuya: అనసూయ అంటేనే నిబ్బి క్యారెక్టర్.. మహానటిలా లేని పోనీ ఈ బింకమేలా ?

యాంకర్ కమ్‌ యాక్ట్రెస్ అనసూయ( Anasuya ) జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యింది.

వేల మూడులో నాగా సినిమాతోనే వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ 2016లో సోగ్గాడే చిన్నినాయన సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

క్షణం సినిమాలో కీలక రోల్ పోషించింది.తర్వాత "రంగస్థలం"లో( Rangasthalam ) రంగమ్మత్త పాత్ర చేసింది.

ఈ రోల్‌లో ఆమె అదిరిపోయే పర్ఫామెన్స్ కనబరిచింది.ఇప్పటిదాకా అనసూయ చేసిన పాత్రలన్నిటిలో అదే బాగా హిట్ అయింది.

అంతే కాదు ఆమెను అనసూయకు బదులుగా రంగమ్మత్త అని కూడా అభిమానులు పిలవడం ప్రారంభించారు.అయితే పెదకాపు-1 సినిమా తర్వాత రంగమ్మత్త అనే పేరును మర్చిపోయి పెదకాపు-1( Peddha Kapu-1 ) సినిమాలో చేసిన అక్కమ్మ పాత్రనే అందరూ గుర్తుపెట్టుకుంటారని అనసూయ బీరాలు పలికింది.

Advertisement

కానీ ఆ పాత్ర గురించి ఎవరూ గుర్తు పెట్టుకోలేదు.అసలు అనసూయ అక్కమ్మ( Akkamma Role ) అనే పాత్ర ఒకటి చేసిందని కూడా ఎవరూ ఇంకా తెలుసుకోలేదు.

సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.పుష్ప సినిమాలో( Pushpa ) అనసూయ చేసిన దాక్ష్యాయణి పాత్ర మాత్రం కొద్దిగా హిట్ అయింది.

అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ రజాకార్ సినిమాలో నటిస్తోంది.ఇప్పటికే బతుకమ్మ డ్యాన్స్ లు ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసింది కానీ విమర్శల పాలయ్యింది.

నిజానికి అనసూయ ఫేస్ అన్ని సన్నివేశాలకు ఫ్లెక్సిబుల్ గా ఉండదు.అయినా కూడా ఆమె తనొక మహానటి అన్నట్లు ఫీల్ అయిపోతుంది.అయితే పెదకాపు-1 సినిమా బాగోలేకపోవడమే తన పాత్ర హిట్ కాకపోవడానికి కారణమని ఆమె చెబుతోంది.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

సినిమా తనకే అర్థం కాలేదని, ఇక ప్రేక్షకులకు ఏమి అర్థమవుతుందన్నట్లు ఆమె రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.అయితే ఆమె దర్శకుడు సరిగా కథ చెప్పలేదని విమర్శిస్తూనే, అతనితో తనకేమీ విభేదాలు లేవంటూ ఒక సమర్ధత కూడా ఇచ్చుకుంది.

Advertisement

ఒకవైపు తిడుతూనే మరొకవైపు దర్శకుడుతో తనకి ఎలాంటి విభేదాలు లేవంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి.దాంతో అనసూయ అంటేనే ఒక అయోమయం క్యారెక్టర్ అని, పెద్ద నిబ్బి అని కొందరు ట్రోల్ చేస్తున్నారు.ఆంటీ అంటే చాలు ఈ యాంకర్ ఆగమాగం అయిపోతుందని కూడా ఆమెను ఎగతాళి చేస్తున్నారు.

ఇకపోతే ఈ హాట్ బ్యూటీ త్వరలో పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) మళ్ళీ ప్రేక్షకులను పలకరించనుంది.ఆ సినిమాతో ఈ తార ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు