అనంతపురం జిల్లా ఈ-క్రాప్ నమోదులో సిబ్బంది చేతివాటం

అనంతపురం జిల్లాలో సచివాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.ఈ- క్రాప్ నమోదులో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కీర్తి ఒక్కో రైతు నుంచి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.తన దగ్గర రూ.500 చెల్లుబాటు కావంటూ రూ.1500 వరకు డిమాండ్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.డబ్బు ఇస్తే ఏ పంట కావాలంటే ఆ పంటపై ఈ క్రాప్ నమోదు చేస్తామంటూ మోసానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.

కాగా ఇందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్లు సమాచారం.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు