పని గంటల విషయంలో వారందరికీ కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

ఇటీవల కాలంలో ప్రముఖ ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ ( L&T Chairman Subrahmanyan )ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొట్టాయి.

అంతేకాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం సామాన్య ప్రజలే కాకుండా నటి దీపికా పదుకొనే, ప్రముఖ వ్యాపారవేత ఆయన హర్ష గోయెంక ( Harsha Goenka )కూడా సుబ్రహ్మణ్యన్ చేసిన వాక్యాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.కేవలం ఉద్యోగమే ముఖ్యం కాదని మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైన అంటూ కౌంటర్ వేశారు.

ఇది ఇలా ఉండగా.గతంలో కూడా ఇన్ఫోసిస్ కో పౌండర్ అయిన నారాయణమూర్తి ( Narayanamurthy )కూడా ప్రతి ఒక్క ఉద్యోగి వారానికి 70 గంటలు పాటు పని చేయాలని వాక్యాలు చేశాడు.అయితే తాజాగా ఈ అంశంపై దేశమంతటా చర్చ జరుగుతున్న క్రమంలో ఆనంద్ గ్రూప్ ఆఫ్ చైర్మన్స్ ఆనంద్ మహేంద్ర కూడా స్పందించారు.

తాము పనిలో నాణ్యతను చూస్తానని.పని సమయాన్ని కాదు అంటూ తెలియచేశాడు.ఢిల్లీలో నిర్వహించిన వికాస్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న ఆనంద్ మహేంద్ర నారాయణ మూర్తి అంటే నాకు చాలా గౌరవం ఉంది.

Advertisement

ఇది తప్పుగా భావించడం లేదు.

కానీ, నేను చెప్పేదేంటంటే ఈ చర్చ ఓ తప్పుడు దారిలో వెళ్తోంది.మనం పని పరిణామం కన్నా.నాణ్యతపై దృష్టి పెట్టాలి.40 గంటలు, 70 గంటలు, 90 గంటల పని గురించి కాదని తెలియజేశారు.అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఆనంద్ మహేంద్రను ఎన్ని గంటలు పనిచేస్తారని అడగగా.

అతను సూటిగా సమాధానం చెప్పకపోయినా, పని నాణ్యత ముఖ్యమని తెలిపారు.ఈ క్రమంలో సోషల్ మీడియా ఎక్స్‌లో మీరు ఎంత సమయం గడుపుతారన్న ప్రశ్నకు కూడా ఆనంద్ మహేంద్ర చక్కటి సమాధానం ఇచ్చారు.

తాను కేవలం స్నేహితులను పరిచయం చేసుకోవడానికి మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తారని అది ఒక అద్భుతమైన బిజినెస్ టూల్ అని తెలియజేశారు.

రోత పుట్టించిన మందుల చీటి రాతతో నకిలీ డాక్టర్ పట్టివేత!
Advertisement

తాజా వార్తలు