పుష్పక విమానం రివ్యూ: నవ్వించిన 'లేచిపోయిన పెళ్ళాం' కథ!

డైరెక్టర్ దామోదర దర్శకత్వంలో రూపొందిన సినిమా పుష్పక విమానం. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, గీతా సైని, శాన్వి మేఘన నటీనటులుగా నటించారు.

కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్ బ్యానర్ పై గోవర్ధనరావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ సినిమాను నిర్మించారు.రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

ఇక ఈ సినిమా ఈరోజు విడుదల కాగా ఆనంద్ దేవరకొండకు ఈ సినిమా నుండి ఎటువంటి సక్సెస్ అందిందో చూద్దాం.

కథ:

ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ చిట్టి లంక సుందర్ అనే పాత్రలో నటించాడు.గీతా సైని మీనాక్షి పాత్ర లో నటించింది.

ఇక సుందర్ గీతను పెళ్లి చేసుకుంటాడు.కానీ మీనాక్షి పెళ్లి అయిన రెండో రోజే మరో వ్యక్తితో వెళ్లిపోతుంది.

Advertisement
Anand Devarakonda Pushpaka Vimanam Movie Review And Rating Details, Anand Devar

ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి సుందర్ చాలా పరిస్థితులు ఎదుర్కొంటాడు.తన భార్య తనతోనే ఉన్నట్లు సమాజానికి నమ్మిస్తాడు.

ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రతో సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటాడు.ఇక ఆ తర్వాత మీనాక్షి ఎందుకు పారిపోయింది, ఎవరితో పారిపోయింది ఆ సమయంలో తన భార్య కోసం సుందర్ పాటుపడ్డ ఇబ్బందుల గురించి మిగతా కథ లోని తెలుసుకోవచ్చు.

Anand Devarakonda Pushpaka Vimanam Movie Review And Rating Details, Anand Devar

నటినటుల నటన:

ఇందులో ఆనంద్ దేవరకొండ తన పాత్రకు న్యాయం చేసినట్లు కనిపించాడు.సుందర్ పాట ఆనంద్ దేవరకొండకు బాగా సెట్ అయింది.గీతా సైని, శాన్వి మేఘన తమ పాత్రలతో బాగా ఆకట్టుకున్నారు.

ఇక సునీల్ కూడా పోలీస్ అధికారి పాత్రలో బాగా మెప్పించాడు.

టెక్నికల్:

ఈ సినిమాను డైరెక్టర్ బాగా కామెడీ పరంగా తెరకెక్కించాడు.అంతేకాకుండా సినిమా తగ్గట్టు నటీనటులను ఎంచుకున్నాడు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

సినిమాలో బ్యాక్ గ్రౌండ్ కూడా బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.

Advertisement

పాటలు కూడా ప్రేక్షకులను బాగా మెప్పించే విధంగా ఉన్నాయి.

విశ్లేషణ:

డైరెక్టర్ దామోదర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.ఈ సినిమాను క్రైమ్ కామెడీ పరంగా తెరకెక్కించగా చాలావరకు ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడేలా ఉంది.ఈ సినిమా టీజర్ సమయంలోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఆనంద్ దేవరకొండ నటనకు ఈ సినిమా కథ కూడా బాగా సెట్ అయిందని అర్థమవుతుంది.ఓ అమ్మాయి పెళ్లికి తర్వాత పారిపోతే తన భర్త పరిస్థితి ఎలా ఉంటుందో అనే కథను కొత్తగా రూపొందించారు దర్శకుడు.

ప్లస్ పాయింట్స్:

కామెడీ బాగా నవ్వించే విధంగా ఉంది.నటీనటుల నటన అద్భుతంగా ఉన్నాయి.

కొత్త కాన్సెప్ట్ తో సినిమా బాగా రూపొందింది.

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ బాగా నెమ్మదిగా సాగినట్లు ఉంది.అంతగా సస్పెన్స్ అనిపించలేదు.సెకండాఫ్ లో కామెడీ మొత్తం తగ్గింది.

సునీల్ ఇన్వెస్టిగేషన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

బాటమ్ లైన్:

ఒక అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో అది పరువు పోవడం కిందికే వస్తుంది.ఇక ఓ పెళ్లి అయిన అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందంటే ఆ భర్త ఎదుర్కొనే పరిస్థితిని ఈ సినిమాలో చూడవచ్చు.

ఈ సినిమాను చాలా వరకు ఆనంద్ దేవరకొండ పాత్ర కోసం చూడవచ్చు.

రేటింగ్: 2.5

తాజా వార్తలు