Foot Whitening Remedy : పాదాలు ఎంత నల్లగా ఉన్నా సరే ఈ ఒక్క రెమెడీతో తెల్లగా మార్చుకోండి!

బయటకు బహిర్గతం అయ్యే శరీర భాగాల్లో పాదాలు ఒకటి.అందుకే తమ పాదాలు తెల్లగా అందంగా మెరిసిపోవాలని చాలా మంది మగువలు ఆరాటపడుతుంటారు.

అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక కారణం వల్ల కొందరి పాదాలు నల్లగా నిర్జీవంగా మారుతుంటాయి.దీంతో ఏం చేయాలో తెలియక, పాదాలను మళ్లీ ఎలా తెల్లగా మార్చుకోవాలో అర్థం కాక స‌త‌మ‌తం అయిపోతుంటారు.

అయితే మీ పాదాలు ఎంత నల్లగా ఉన్నా సరే ఇప్పుడు చెప్పబోయే ఒక్క రెమెడీతో సులభంగా మరియు వేగంగా తెల్లగా మార్చుకోవ‌చ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక టమాటో ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండుకు ఉన్న తొక్కలను సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి.

Advertisement
An Effective Home Remedy To Whiten Foot Is For You, Home Remedy, Foot, Foot Whit

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు మరియు నిమ్మ తొక్క‌లు వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ లో వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి, రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా మిక్స్ చేసుకున్న‌ మిశ్రమాన్ని పాదాలకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

An Effective Home Remedy To Whiten Foot Is For You, Home Remedy, Foot, Foot Whit

అనంతరం నిమ్మ చెక్కతో పాదాలను స్క్రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే నల్లగా నిర్జీవంగా మారిన మీ పాదాలు తెల్లగా మరియు మృదువుగా మార‌డం ఖాయం.కాబట్టి నల్లటి పాదాలతో వర్రీ అయిపోతున్నవారు ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు