Jagityala Hanuman: బావి తవ్వుతుండగా బయటపడిన పురాతనమైన విగ్రహం.. దర్శనం కోసం భారీగా తరలివస్తున్న భక్తులు..

మన దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రధానమైన ఆలయాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలలో ప్రతిరోజు భక్తులు వచ్చి పూజలు, హోమాలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.

ఒక్కో దేవాలయానికి ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి ఎంతో భక్తితో భగవంతుని పూజిస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో రహస్యాలను దాచుకున్న దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయి.

An Ancient Idol Unearthed While Digging A Well Devotees Are Flocking To See It

అంతేకాకుండా కొన్ని పురాతనమైన తవ్వకాలలో ఆ పూర్వ వైభవానికి గుర్తుగా చాలా విగ్రహాలు, వస్తువులు మన దేశవ్యాప్తంగా అక్కడక్కడ బయటపడుతూనే ఉంటాయి.తాజాగా రామ భక్తుడైన ఆంజనేయ స్వామి పురాతన భారీ విగ్రహం ఒకటి బయటపడింది.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ప్రాంతంలో పురాతన హనుమంతుని రాతి విగ్రహం ఒకటి తవ్వకాలు జరుగుతుండగా కనిపించింది.రాయికల్ కు చెందిన ఒక రైతు తన వ్యవసాయ భూమిలో భావి కోసం తవ్వకాలు మొదలుపెట్టాడు.

Advertisement

జెసిపి తో బావి కోసం ఒక పెద్ద గొయ్యి నుంచి మట్టి తీస్తున్న సమయంలో భారీ రాతి విగ్రహం ఒకటి కనిపించింది.వెంటనే అక్కడి స్థానికులు అధికారులకు సమాచారం తెలియజేశారు.

ఆ తర్వాత అ పురావస్తు శాఖ అధికారులు అక్కడకు చేరుకొని ఆ విగ్రహాన్ని పరిశీలించారు.ఆ విగ్రహం అతి పురాతనమైనదని అప్పటి ప్రజలు ఈ హనుమంతుని విగ్రహాన్ని రాతితో మలిచినట్లు పురావస్తు శాఖ నిపుణులు తెలియజేశారు.

ఈ విగ్రహాన్ని చూడడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు.ప్రాంతంతో సంబంధం లేకుండా ఆంజనేయుడికి చాలా మంది భక్తులు పూజలు చేస్తూ ఉంటారు.

హనుమంతుని, భజరంగి, మారుతీ అని ఎన్నో రకాల పేర్లతో ఆంజనేయస్వామిని పిలుస్తూ ఉంటారు.దేశంలో హనుమంతుని దేవాలయం లేని గ్రామం అస్సలు లేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
Advertisement

తాజా వార్తలు