టికెట్ లేకుండానే విమానం ఎక్కిన అమెరికా యువతి.. చివరకు?

నిత్యం జరిగే నేరాల వల్ల.ప్రతి చోటా సెక్యూరిటీ సదుపాయం ఉంటుంది.

రవాణా సంస్థలో, షాపింగ్ మాల్స్ లో, సినిమా హాల్స్ లో వంటి ఇతర రంగాలకు సంబంధించిన సంస్థలలో ఎంట్రెన్స్ గేట్ వద్ద తనిఖీలు జరుగుతుంటాయి.రవాణా సంస్థకు సంబంధించిన విషయంలో వాయు రవాణా అయినా విమానాశ్రయం లో జరిగే తనిఖీలు అంతో ఇంతో కాదు.

విమానాశ్రయం మొదలు నుండి విమానం లో కూర్చునే వరకు తనిఖీలు జరుగుతుంటాయి.కాగా ఇంత సెక్యూరిటీ సిబ్బంది తో ఉన్న విమానాశ్రయం లో ఓ యువతి టికెట్ లేకుండానే విమానం ఎక్కిన సంఘటన చోటు చేసుకుంది.

అమెరికా లో యాజ్మినా పేటన్ అనే 23 ఏళ్ల యువతి.చికాగోలోని ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అమెరికా ఎయిర్ లైన్స్ విమానం ను టికెట్ లేకుండా ఎక్కడానికి ప్రయత్నించింది.

Advertisement

విమాన టికెట్లు తనిఖీలు చేసే సెక్యూరిటీ గేటు వద్ద ఈ యువతి చాలా ప్రయత్నాలు చేసి.అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అధికారులను కన్నుగప్పి విమానం దగ్గరకు చేరుకుంది.

విమానాశ్రయంలో విమానంలో ఎక్కి కూర్చున్న వరకు ప్రతి విషయంలో సెక్యూరిటీ సిబ్బంది అధికారులు తనిఖీలు చేస్తుంటారు.కాగా ఆ యువతి అన్ని గేట్లను తన ప్రయత్నంతో సులువుగా చేరుకోగా.

అసలైన చెక్ పాయింట్ అయినా విమానంలో దొరికిపోయింది.విమాన సిబ్బంది అధికారులు తనని టికెట్, బోర్డింగ్ పాస్ వంటివి చూపించమని అడిగినప్పుడు ఆ యువతి నుండి ఎటువంటి స్పందన లేకపోయేసరికి ఆమెను అక్కడనే అదుపులోకి తీసుకున్నారు.

ఆమెను అధికారులు నిలదీయగా అమెరికా ర్యాపర్ జేజీని చూడాలన్న కోరికతో విమానం ఎక్కాలనుకున్న విషయం తెలిపింది.దీంతో ఆమెను కోర్టులో హాజరుపరచగా ఆమె చేసిన నేరానికి 500 డాలర్ల జరిమానా విధించి ఇకపై ఆ ఎయిర్ పోర్టుకు వెళ్లకూడదని కోర్టు శిక్ష విధించింది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు